దిగ‌జారుడు రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ ఆవేద‌న‌!

Update: 2018-08-10 10:38 GMT
దివంగ‌త మ‌హానేత - ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజ శేఖ‌ర్ రెడ్డి హయాం నుంచి ప్ర‌త్యేకించి ఓ మీడియా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌నిగ‌ట్టుకొని వైఎస్ ను - ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్ చేయ‌డం....అకార‌ణంగా ....అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయ‌డం తెలిసిందే. ఆ మ‌హానేత నిష్క్ర‌మించ‌డం...దాంతో, రాష్ట్రం ముక్క‌ల‌వ‌డం....ఆ త‌ర్వాత ఎల్లో మీడియా కొమ్ముకాచే పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆ విష ప్ర‌చారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏపీ సీఎం చంద్ర‌బాబును భుజ‌స్కంధాల‌పై మోస్తోన్న‌ ప‌చ్చ ప‌త్రిక‌లు - చానెళ్లు ....ఇపుడు గ‌త తొమ్మిదేళ్లుగా జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఇక 2014లో చంద్ర‌బాబు సీఎం అయిన  త‌ర్వాత ఎల్లో మీడియాకు ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండాపోయాయి. స‌ద‌రు ఎల్లో మీడియాకు .....చంద్ర‌బాబు మిన‌హా లోక‌మంతా ప‌చ్చ‌గానే క‌నిపిస్తుంది. ఇక గ‌త నాలుగేళ్లుగా జ‌గ‌న్ పై విషం చిమ్మ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ప‌నిచేస్తోన్న ఎల్లో మీడియా...తాజాగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై దృష్టి పెట్టింది. తాజాగా, వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిపై కూడా విష‌పు రాత‌లు రాస్తూ త‌మ ఎల్లోనందాన్ని పొంద‌డం ప్రారంభించింది. రేపటి నుంచి జగన్ సతీసమేతంగా కోర్టుకు హాజరు కావాలంటూ.......తమ ప‌చ్చ పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఈ నేప‌థ్యంలో ఆ రాత‌ల‌పై జ‌గ‌న్ ఘాటుగా స్పందించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్ హ‌వా న‌డుస్తోంద‌ని జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. అయితే, ఆ విష‌యం ఎల్లో మీడియాకు క‌న‌ప‌డ‌దు...విన‌ప‌డ‌ద‌న్న‌ది వేరే సంగతి. జ‌గ‌న్ `ఫ్యాన్`గాలి బ‌లంగా వీస్తోన్న నేప‌థ్యంలో....రాబోయే ఎన్నిక‌ల్లో సైకిల్ కు పంక్చ‌ర్ ప‌డుతుందేమోన‌న్న బెంగ ప‌చ్చ మీడియాకు ప‌ట్టుకుంది. దీంతో, త‌మ అనుకూల వ‌ర్గం అధికారంలో ఉండ‌గానే త‌మ ప‌చ్చ రాత‌ల‌ను...పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని గ‌ట్టిగా అనుకుంది. అందుకే, భార‌తి పేరును సీబీఐ వ‌దిలేసినా....ఈడీ మాత్రం వదల్లేదని...రేప‌టి నుంచి స‌తీస‌మేతంగా జ‌గ‌న్ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంటుందంటూ క‌థ‌నాల‌ను వండి వార్చింది. అయితే, అస‌లు వాస్త‌వం మాత్రం వారి రాత‌ల‌కు పూర్తిగా భిన్నంగా ఉంది. జగన్ భార్య భారతి పేరును కూడా చార్జిషీట్లో చేర్చడానికి కోర్టు అనుమతిని ఈడీ కోరింది. అయితే, దానికి కోర్టు అనుమ‌తిస్తుందో లేదో....తెలియాల్సి ఉంది. కానీ, బ్ర‌హ్మంగారి అంశ‌లో పుట్టిన ప‌చ్చ‌మీడియా మాత్రం.....త‌మ అపార మేధ‌స్సును, కాల‌జ్ఞానాన్ని ఉప‌యోగించి ముందుగానే క‌థ‌నాలు వండేసింది. దీంతో, ఆ రోత‌ల‌పై...కాదు కాదు...రాత‌ల‌పై జ‌గ‌న్ మండిప‌డ్డారు.

స‌ద‌రు మీడియా రాసిన రాత‌ల‌పై జ‌గ‌న ట్విటర్ ద్వారా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ``ఈ రోజు కొన్ని మీడియా సంస్థ‌లు రాసిన వార్త‌లు చూసి షాక‌య్యాను. నా భార్య భార‌తి పేరును నిందితురాలిగా ....ఈడీ చార్జిషీటులో చేర్చిందంటూ రాశారు. ఆఖ‌రికి కుటుంబ స‌భ్యుల‌నూ వ‌ద‌ల‌కుండా విష ప్ర‌చారం చేసే స్థాయికి రాజ‌కీయాలు దిగ‌జారినందుకు ఎంతో చింతిస్తున్నాను`` అని జగన్ ట్వీట్ చేశారు. నాలుగేళ్లుగా త‌న‌పై క‌క్ష్య సాధిస్తోన్న ఎల్లో మీడియా...ఇపుడు త‌న కుటుంబీకులను కూడా వదలక‌పోవ‌డంపై జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే, జగన్ పై పెట్టిన కేసుల్లోని చార్జిషీట్లు చాలా వరకూ కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు, ఉండ‌వ‌ల్ల వంటి రాజ‌కీయ ఉద్ధందుడు కూడా....జ‌గ‌న్ పై కేసులు నిల‌బ‌డ‌వ‌ని ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ....జగన్ స‌తీమ‌ణి భార‌తి పేరునూ వార్తల్లోకి లాగ‌డం శోచ‌నీయం. 2019లో త‌మ అనుకూల పార్టీకి అధికారం ద‌క్కుతుందో లేదో తెలియ‌ని అస‌హ‌నం....అధికారంలో ఉన్న కొద్దినెలల్లోనే ...మ‌రో ఐదేళ్ల‌కూ స‌రిప‌డా విషం చిమ్మాల‌నే క‌సి....వెర‌సి ఈ త‌ర‌హా రాత‌లు రాయడంలో పెద్ద ఆశ్చ‌ర్యం ఏమీలేదు. ముందుముందు ప‌చ్చ పాత్రికేయం...ఏ స్థాయికి దిగ‌జారుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News