అనంత‌లో జ‌గ‌న్ హోదా స‌మ‌ర శంఖం

Update: 2017-10-08 05:23 GMT
విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి సాయంగా నిలిచేందుకు.. అండ‌గా ఉండేందుకు వీలుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తానన్న మాట‌ను చెప్ప‌టం.. ఏపీ పాల‌కుల పుణ్య‌మా అని హ‌క్కుగా రావాల్సిన హోదాను ఇప్పుడు అడుక్కునే వ‌ర‌కూ వెళ్లింది. నిండు పార్ల‌మెంటులో అంద‌రి ఎదుట ఏపీని ఆదుకుంటామ‌ని నాటి ప్ర‌ధాని ఇచ్చిన హామీని నేటి ప్ర‌ధాని మోడీ లైట్ తీసుకుంటున్న వేళ‌.. ఆంధ్రోళ్లంటే అంత చులక‌న అంటూ ప్ర‌శ్నించాల్సింది పోయి కామ్ గా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరును నిల‌దీసే వారు లేని వేళ‌.. ఏపీ విప‌క్ష నేత ఆంధ్రోళ్ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై యువ‌భేరీతో స‌మ‌ర‌శంఖాన్ని పూరించిన వైనం తెలిసిందే.

ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ అధికార‌ప‌క్షం మాట‌లు రాని మూగ‌దానిలా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. మిత్రుడ్ని అడిగి తీసుకురావాల్సింది పోయి.. న‌మ్మి అధికారాన్ని చేతికిచ్చిన ప్ర‌జ‌ల‌కు చేయ‌కూడ‌ని మోసం చేశారు చంద్ర‌బాబు. ప్ర‌త్యేక హోదాతో ఏపీకి జ‌రిగే లాభాల్ని వ‌దిలేసి.. వాటి గురించి మాట్లాడ‌ని చంద్ర‌బాబు.. హోదాకు హ్యాండ్ ఇస్తే.. మౌనంగా ఉన్నారే త‌ప్పించి నిల‌దీసింది లేదు.

త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ స‌ర్కారుపై ఒత్తిడి తేవ‌టాన్ని వ‌దిలేసి.. స్పెష‌ల్ ప్యాకేజ్ అంటూ ప‌డేసిన బిస్కెట్‌ను క‌ళ్ల‌కు అద్దుకొన్న తీరును ఆంధ్రా ప్ర‌జానీకం మ‌ర్చిపోలేరు. ఇలాంటివేళ‌.. ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని ఎలుగెత్తి చాటే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ప్ర‌త్యేక హోదాతో ల‌క్ష‌లాది ఉద్యోగ‌.. ఉపాధి అవ‌కాశాలు ల‌భించే అవ‌కాశంతో పాటు రాయితీల‌తో వ‌చ్చే ల‌క్ష‌ల కోట్ల రూపాయి పెట్టుబ‌డుల గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించ‌టానికి.. ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

హోదాపై ఏపీ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే దిశ‌గా యువ‌భేరి స‌ద‌స్సుల్ని నిర్వ‌హిస్తోంది ఏపీ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ప్ర‌త్యేక హోదా.. ఆంధ్రుల హ‌క్కు పేరిట అనంత‌పురంలో స‌ద‌స్సును ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 10న అనంత‌పురంలో జ‌రిగే ఈ స‌ద‌స్సుతో ప్ర‌త్యేక హోదా మీద మ‌రోసారి చ‌ర్చ‌ను తెర మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఇప్ప‌టికే తొమ్మిది చోట్ల నిర్వ‌హించిన యువ‌భేరీ .. తాజాగా ప‌దో యువ‌భేరీ ఈ నెల 10న నిర్వ‌హిస్తుండ‌టం విశేషం. నిజానికి ఈ స‌భ‌ను గ‌తంలోనే నిర్వ‌హించాల్సి ఉంది. అయితే.. విద్యార్థుల ప‌రీక్ష‌లు.. పోటీ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో వాయిదా వేశారు. తాజాగా నిర్వ‌హించ‌నున్న ఈ భేరీ ఏపీ ప్ర‌త్యేక హోదా మీద చ‌ర్చ‌ను మ‌రోసారి తెర మీద‌కుతెస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News