మాయ‌లు వ‌ద్దు..మ‌భ్య పెట్టొద్దు: జ‌గ‌న్‌

Update: 2015-09-15 10:14 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా విషయంలో కొంద‌రు నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను మాయ చేయాల‌ని  చూస్తున్నార‌ని...ద‌య‌చేసి మాయ చేయ‌డం..ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టాల‌నుకోవడం మానుకోవాల‌ని వైకాపా అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ తిరుప‌తిలో మంగ‌ళ‌వారం జ‌రిగిన విద్యార్థుల యువ‌భేరీ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. ఎస్వీ వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో జ‌రిగిన ఈ స‌ద‌స్సులో జ‌గ‌న్ మాట్లాడుతూ ఎస్వీ వ‌ర్సిటీలో స‌ద‌స్సు నిర్వ‌హించాల‌నుకుంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎక్క‌డ‌లేని నిబంధ‌న‌ల‌ను సాకుగా చూపుతూ ఈ స‌భ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

యూనివ‌ర్సిటీల్లో మీటింగులు పెట్ట‌రాద‌ని ప్ర‌భుత్వం ఎన్ని ఆంక్ష‌లు విధించినా స‌దస్సుకు వ‌చ్చిన వారిని చూస్తే త‌న‌కు చాలా సంతోషంగా ఉందంటూ వారిని అభినందించారు. ఇదే యూనివ‌ర్సిటీల్లో సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు ఎప్పుడూ స‌మావేశాలు పెట్ట‌లేదా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేవ‌ర‌కు తాను నిరంత‌ర పోరాటం చేస్తాన‌న్నారు.

జ‌గ‌న్ ప్ర‌సంగంలో హైలెట్స్‌:

- చంద్ర‌బాబు+కాంగ్రెస్ క‌లిసి రాష్ర్టాన్ని విడ‌గొట్టారు

- ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని రాష్ర్టాన్ని విభ‌జించారు. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌డం లేదు

- ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని పార్ల‌మెంటులో ప్ర‌ధాని ఇచ్చిన హామీ ఏమైంది

- ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటులో డిమాండ్ చేసిన బీజేపీ మాట నిల‌బెట్టుకోలేదు

- కేంద్రం ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌న‌ప్పుడు చంద్ర‌బాబు కేంద్రంలో కొన‌సాగ‌డం ఎందుకు ?

- తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అవినీతికి పాల్ప‌డుతూ అడ్డంగా బుక్ అయ్యారు

- త‌న‌పై న‌మోదైన అవినీతి కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకే చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు

- గ‌తంలో 11 రాష్ర్టాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చిన‌ప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వ‌రు

- హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం వ‌ల్ల వేలాది ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. రాష్ర్టం అభివృద్ధి జ‌రిగింది
Tags:    

Similar News