వైఎస్ వివేకా హత్యకేసు: సీబీఐ కస్టడీకి సునీల్ కుమార్

Update: 2021-08-07 10:30 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల అరెస్ట్అయిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 10 రోజులపాటు ఇతడిని విచారించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు.

సునీల్ కుమార్ ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. ఇతడిని పులివెందుల తీసుకెళ్లి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణ వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రోటరీపురం రోడ్డులో అనుమానాస్పద ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది.

ఈనెల 16వరకు విచారణ నిమిత్తం సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం పులివెందుల మెజిస్ట్రేట్ అనుమతించారు. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కడప కేంద్ర కారాగారం నుంచి సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు కసట్డీలోకి తీసుకున్నారు.

కేంద్ర కారాగారం ఆవరణలోని గెస్ట్ హౌస్ లో సీబీఐ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కార్యాలయానికి సునీల్ కుమార్ యాదవ్ ను తీసుకెళ్లారు.

కాగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల షాపు యజమాని మున్నాను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించి కీలక విషయాలు రాబట్టారు.




Tags:    

Similar News