వైఎస్ వివేకా హత్య: వాచ్ మెన్ రంగన్న ఏం చెప్పాడు?

Update: 2021-07-24 04:30 GMT
వైఎస్ వివేకా హత్యలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. వాచ్ మెన్ రంగన్న సీబీఐకి కీలక సాక్ష్యంగా దొరికినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రంగన్న ఏం చెప్పాడు? ఆయన వాంగ్మూలాన్ని ఏకంగా మెజిస్ట్రేట్ వద్ద ఎలా రికార్డ్ చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షిగా ఉన్నారు. పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద భడవాండ్ల రంగన్న అలియాస్ రంగయ్య (65) కాపలాదారుడిగా ఉంటున్నాడు.వైఎస్ వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే ఆ ఇంటి కాపలదారుగా ఉన్నాడు.

వైఎస్ వివేకాను చివరి సారిగా చూసింది రంగన్ననే. హత్యకు గురైన మార్చి 15న ఉదయం వివేకా నిద్రలేచి బయటకు రాకపోయేసరికి పక్కడోరులోంచి బయటకు వెళ్లి చూడగా బాత్ రూంలో రక్తపుమడుగులో ఉన్నట్లు గుర్తించారు. అందరికీ చెప్పింది రంగన్ననే. అందుకే ఈ హత్యలో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడు.

వైఎస్ వివేకా ఏపీ సీఎం జగన్ కు సొంత బాబాయి. మాజీ సీఎం వైఎస్ఆర్ కు సొంత తమ్ముడు. దీంతో ఈ హత్య కేసు విచారణ ప్రతిష్మాత్మంగా మారింది.

వైఎస్ వివేకా హత్యపై ఆయన ప్రత్యర్థులైన పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో సీబీఐ ఈ కేసులో ఎవరిని దోషులుగా తేల్చుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

శుక్రవారం వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వైఎస్ వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వాంగ్మూలం కీలకంగా మారబోతోందని తెలుస్తోంది.

సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందిన వారని.. ఇద్దరు సుపారీ ఇచ్చారని.. మరో వ్యక్తి, మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లనుచెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News