ఆంధ్రరాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కమీషన్ల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడి లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే పోలవరం మీద చిత్తశుద్ధి ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని బొత్స అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించాల్సిన నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకొని విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్ - వ్యవసాయానికి - విద్యుత్ శక్తికి - కోట్ల మంది ప్రజల గొంతు తడిపేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారని బొత్సా సత్యనారయణ గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆ శంకుస్థాపనలో పాల్గొనే మహాభాగ్యం తనకు కలిగిందన్నారు. సుమారు రూ. వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు పూర్తి చేశారని - నిర్మాణానికి కావాల్సిన అనుమతులు కూడా సాధించారని గుర్తు చేశారు. వైఎస్ ఆర్ తరువాత పాలించిన ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని బొత్సా ఆరోపించారు. తాజాగా, కేంద్రమంత్రి గడ్కరీ ప్రశ్నలతో చంద్రబాబు అవినీతి బట్టబయలైందన్నారు. రెండోసారి పోలవరం సందర్శించిన గట్కరీ చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేశారని - వాటికి సమాధానం చెప్పాలేక మీడియా సమక్షంలో చంద్రబాబు నీళ్లు నమిలారన్నారు. మొదటి డీపీఆర్ - రెండో డీపీఆర్ కు ఎందుకు వ్యత్యాసాలు ఉన్నాయి.. ల్యాండ్ ఎక్స్ టెన్షన్ - నిర్మాణాల అంచనా ఎందుకు ఎందుకు పెరిగిందని అడిగితే సీఎం నేరస్తుడిలా బేల మోహం వేసుకున్నారని - సమాధానం చెప్పాలేక బిత్తర చూపులు చూశారన్నారు. చంద్రబాబు నైజం. వీక్ నెస్ కేంద్రమంత్రికి తెలుసు కాబట్టే జంకుతున్నారని బొత్స అరు. ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్న నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా..? ఇది జరిగి 24 గంటలు అవుతున్నా.. ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.తమ అవినీతి బయటపడింది కాబట్టే గప్ చుప్ అయిపోయారని అన్నారు.
పట్టిసీమ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడింది వాస్తవమని బొత్స ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరాన్ని అనే అంశాన్ని తెరమీదకు తీసుకురాకుండా స్వార్థంతో అవినీతికి ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమ నిర్మాణం చేపట్టారన్నారు. చంద్రబాబు చర్యతో మేధావులు - రాజకీయ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారని - సుమారు రూ. 16 వందల కోట్లు ఖర్చు చేసి ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెట్టి.. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసిన వారికి కాంట్రాక్టులు ఇప్పించి వందల కోట్లు దోపిడీకి పాల్పడ్డారన్నారు. . కేంద్ర బడ్జెట్ లో పోలవరానికి అరకొర నిధులు కేటాయించిన ఏ ఒక్క రోజు చంద్రబాబు మాట్లాడలేదని, ఒత్తిడి తీసుకురాకుండా అవినీతి కోసం పట్టిసీమ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలు చేశారన్నారు. లక్షలాది మందిని ఆదుకునే పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టి అవినీతి కోసం నిర్మాణాన్ని అడ్డుకోవడం భావ్యమా చంద్రబాబూ అని బొత్స ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ కట్టి జాతికి అంకితం అంటారు.. ప్రతి సోమవారం పోలవరంఅని అనేక మార్లు ప్రజలను మోసగించారన్నారు. దయచేసి ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి పోలవరంపై మీ తాలూకా విధానం ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు.