కాయ్ రాజా కాయ్‌... వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం!

Update: 2021-06-29 08:30 GMT
ప్ర‌కాశం జిల్లాపై సీఎం జ‌గ‌న్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. మంత్రులు బాలినేని  శ్రీనివాస‌రెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌లు కూడా జిల్లాను అభివృద్ధి ప‌థంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. అయితే.. ఇంత చేస్తు న్నా.. ఒక ఎమ్మెల్యే కార‌ణంగా వీరు చేస్తున్న అభివృద్ధి, సీఎం జ‌గ‌న్ ఇమేజ్ కూడా మ‌ట్టి కొట్టుకుపోతున్నాయ‌ని అంటున్నారు స్థానిక నేత‌లు. దీనికి కార‌ణం.. స‌ద‌రు ఎమ్మెల్యే చేస్తున్న నిర్వాక‌మేన‌ని చెబుతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రియ‌ల్ ఎస్టేట్ దందా న‌డిప‌స్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేగారి త‌మ్ముడు రంగంలోకి దిగి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఎక‌రానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పుడ డిమాండ్ చేస్తున్నార‌ని.. అంటున్నారు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై స్థానిక నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపైకొంద‌రు నేతలు ఏకంగా.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ని.. లేఖ‌లు కూడా రాశార‌ని చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు, అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న కాంట్రాక్టులు, ఇత‌ర త్రా ప్ర‌భుత్వం చేప‌ట్టే ప‌నుల‌కు కూడా క‌మీష‌న్లు గుంజుతున్నార‌ని.. ఆ త‌మ్ముడిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ విష‌యంపై కూడా పెద్ద ఎత్తున హైక‌మాండ్‌కు ఫిర్యాదులు అందాయ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఎమ్మెల్యేకి హైక‌మాండ్ నుంచి పిలుపు వ‌స్తుంద‌ని అంటున్నారు స్థానిక నేత‌లు. ఈ క్ర‌మంలో స్థానిక నేత‌లు చేసిన ఫిర్యాదుల‌పై నిల‌దీయ‌డంతోపాటు.. వారు రాసిన ఉత్త‌రాల‌ను కూడా ఆయ‌న ముందు పెట్టి వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. స‌ద‌రు ఎమ్మెల్యే  త‌మ‌ముడి కార‌ణంగా.. వైసీపీలో నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా ఫిర్యాదులు అందాయ‌ని.. ప్ర‌స్తుతం ఇవి ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని.. చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News