ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి లెక్కలు చూస్తే అక్కడ వైసీపీ నేతల జోరే కనిపిస్తోంది. ఈ కేసులో ఇంతవరకు 80 మందిని అరెస్టు చేశారు. అంతులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరుగురు ఉండగా... వైకాపా నేతలు ఏకంగా 27 మంది ఉన్నారు. ముగ్గురు సిపిఐ నేతలు - 44మంది ఏ పార్టీకి చెందని వారిని అరెస్టు చేశారు.
కాగా కాల్ మనీ అరాచకాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాల్ మనీ వ్యవహారంలో ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాల్ మనీ దందాపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదిక వచ్చిన తర్వాత నిందితులందరిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మనీలాండరింగ్ చట్టం ఉండేదని, ప్రస్తుతం తెలంగాణలోనూ ఆ చట్టం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ అరాచకాలను అరికట్టేందుకు మనీలాండరింగ్ చట్టానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
కాల్ మనీ కేసులో అత్యధికులు వైసీపీవారే ఉండడంతో తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి - కాంగ్రెస్ ఏపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు సీఎం అంటే కాల్ మనీ అంటున్న రోజాపైనా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో 80 మంది అరెస్టయితే అందులో 27 మంది వైసీపీవారే ఉన్నారని.... అలాంటప్పుడు కాల్ మనీకి సీఎంకు ఎలా లింకు పెడతారని విరుచుకుపడుతున్నారు.