వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడటానికి వారు వివిధ రకాల ట్రిక్స్ ను ప్రయోగిస్తూ ఉన్నారు. పార్టీలోకి చేరికలు అంటూ వారిలో కొందరు ఎలాగోలా జగన్ దగ్గర మార్కులు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా.. నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి గుర్తింపు లేని కొందరు వ్యక్తులను తీసుకెళ్లి గురించి ఎక్కువగా చెప్పి.. వారికి జగన్ చేత కండువాలు వేయించే ప్రయత్నం చేస్తూ ఉన్న వైనాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా పార్టీలోకి చేరికలు చేయించినట్టుగా ముఖ్యమంత్రి వద్ద మార్కులు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్లు.
అధినేత సమక్షంలో చేరికలు అనేవి ఏ పార్టీకి అయినా ముఖ్యమే. అయితే సీఎం స్థాయిలో ఉన్న అధినేత దగ్గరకు ఏ స్థాయి నేతలను తీసుకెళ్లాలో నేతలకు అవగాహన అవసరం. ఏ మాజీ ఎమ్మెల్యేనో, వేరే పార్టీకి చెందిన నియోజవకర్గం స్థాయి ఇన్ చార్జినో తీసుకెళ్లి పార్టీలోకి సీఎం సమక్షంలో చేర్పిస్తే అది నిజంగా గొప్పే. అయితే వైసీపీ నేతలు కొందరు ఈ స్థాయిలో కష్టపడుతున్నట్టుగా లేదు.
ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే.. సర్పంచ్ స్థాయి వ్యక్తిని తీసుకెళ్లి జగన్ చేత ఆయనకు కుండువా వేయించారు. తను పార్టీలోకి ఏదో ఒక గొప్ప నేతను తీసుకొచ్చినట్టుగా అక్కడ బిల్డప్ ఇచ్చారు. అయితే అసలు విషయం కొంతమందికే తెలుసు. ఆ ఎమ్మెల్యే తీసుకెళ్లింది ఒక సర్పంచ్ రేజ్ నేతను అని, అయితే ముఖ్యమంత్రి వద్ద మార్కులు పొందే ప్రయత్నంలో భాగంగా అలాంటి అనామక నేతను చేర్చి అదేదో గొప్ప అయినట్టుగా బిల్డప్ ఇచ్చారని సమాచారం. ఈ విషయం గురించి నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది.
మరీ సర్పంచ్ రేంజ్ వ్యక్తిని సీఎం దగగరకు తీసుకెళ్లడంపై ఆ ఎమ్మెల్యే మీద కూడా విమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. తన ప్రాపకం కోసం ఆయన ఇలాంటి సిల్లీ ఎత్తుగడలు వేస్తున్నారని.. అసలు విషయం మాత్రం పార్టీ అర్థం చేసుకుంటుందని పార్టీలోని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు.