అసలు ఆ ప‌థ‌కం వేస్ట్‌.. జ‌గ‌న్ సంక్షేమ‌ ప‌థ‌కాల‌పై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్‌

Update: 2022-05-22 09:10 GMT
జ‌గ‌న్ నిల‌బ‌డితే.. మాస్‌.. జ‌గ‌న్ కూర్చుంటే మాస్‌! అంటూ.. చెక్క భ‌జ‌న చేసే వైసీపీ నాయ‌కులు.. ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను క‌ళ్ల‌క‌ద్దుకుని.. అవే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని .. న‌మ్ముకుని ముందుకు సాగుతున్న ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. స‌రే.. అవి గెలిపిస్తాయో.. లేదో తెలియ‌దు కాదు.. నాయ‌కులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు కూడా ఇవే ఆశ‌లు పెట్టుకున్నారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం అస‌లు.. జ‌గ‌న్ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరిట‌.. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని ఆదేశించారు.

అంటే సంక్షేమ ప‌థ‌కాల‌కు.. జ‌గ‌న్ ఇస్తున్న ప్రాధాన్యం.. నేత‌లు పెట్టుకున్న న‌మ్మ‌కం అంతా పెద్ద ఎత్తున క‌నిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఇదే వైసీపీలో కీల‌క ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలోని జ‌గ‌న్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న "జలకళ" పథకంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావు పేట గ్రామంలో నిర్వహించిన 'గుడ్ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. "జలకళ" పథకమే వేస్ట్ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "జలకళ" బోరుబావుల తవ్వకం పథకంపై.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామంలో నిర్వహించిన 'గుడ్ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఓ మహిళా రైతు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

"జలకళ" బోరు వేశారని.. కానీ, ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని మల్లీశ్వరి అనే మ‌హిళా రైతు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో.. ఎమ్మెల్యే స్పందిస్తూ.. జలకళ పథకం కింద ఎంతమందికి బోర్లు వేయా లి..? ఎంత లోతు వేయాలి? అనేది మాకు కూడా అర్థం కాలేదని ఆయన అన్నారు.

అసలు ఈ పథకమే తప్పని.. ఒకరికి వేసి ఒకరికి వేయలేని ప‌రిస్థితి తలెత్తుతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో.. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అదేసమయంలో 'అసలు ఈ స్కీమే తప్పుడు స్కీమ్‌. ఒకరికి వేసి, మరొకరికి వేయడం లేదు' అని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News