ప్రస్తుత సమాజంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఏపీలో శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సభలో తోలి రోజే టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా మహిళలపై జరిగే దారుణాలని తగ్గించడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై అసెంబ్లీ లో వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలోని మహిళా ఎమ్మెల్యే లు భద్రత గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ అత్యాచారం మరియు హత్య ఘటనను ప్రస్తావిస్తూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అందరినీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
మహిళల విషయంలో సమాజం మైండ్ సెట్ మారాలని - ఆ విధంగా మార్పు తీసుకురావడానికి రాజకీయ నాయకులు కూడా తమ వంతు కృషి చేయాలని - దిశ అత్యాచారం - హత్య చేసిన నిందితుల బైక్ పై పుర్రె బొమ్మ ఉందని - డేంజర్ అని రాసి ఉందని ఆమె ఫోటో చూపించి మరీ నేరస్తుల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. అలాగే ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం మద్యమే అని , గత ప్రభుత్వాల హయాంలో ఏపీ లో మద్యం ఏరులై పారింది అని విమర్శించారు. గతంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో మహిళలు హైవే బస్టాండ్ ల నుండి ఇళ్లకు వెళ్లాలంటే ఎంతో భయపడే వారిని - కానీ ఇప్పుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మద్యంపై నియంత్రణ తీసుకు వచ్చాక అలాంటి భయం లేకుండా మహిళలు రాత్రి ఎనిమిది తర్వాత కూడా ప్రయాణాలు చేయగలుగుతున్నారని రజనీ అన్నారు.
ఒకవేళ నేరం జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన న్యాయం అందించాలని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోని శాంతిపురం లో టీడీపీ వైసీపీ నేతల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఒక మహిళను వివస్త్రను చేశారనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల పట్ల గత ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి - ప్రస్తుత పాలక ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి చాలా వ్యత్యాసం ఉందని - ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లో ఉన్న చంద్రబాబు మహిళా సంక్షేమం కోసం ఏమీ చేయలేకపోయారని ఎమ్మెల్యే రజిని చెప్పారు. అలాగే మద్యపానాన్ని నియంత్రించి ఉంటే దిశ పై సామూహిక అత్యాచార ఘటన జరిగేది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.