కరోనాపై ఫైట్.. వైసీపీ ఎంపీల ఉదారత

Update: 2020-03-25 06:10 GMT
కరోనా వైరస్ దేశంలో విశృంఖలంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి అందరూ చేయూతనిస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పటికే విరాళాలు కొందరు ప్రకటించారు.

తాజాగా ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎంపీలు కరోనాపై యుద్ధానికి ముందుకొచ్చారు. తమ వంతుగా రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి - మరో నెల జీతాన్ని ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి - ఆ పార్టీలో  లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరూ బయటకు రావద్దని.. కరోనాను ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి కట్టడి చేయాలని సూచించారు.

పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం అందజేస్తున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటానికి అందరూ ముందుకు రావాలని.. తమ వంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News