పార్టీ మారినంతనే పాత విషయాల్ని మర్చిపోయి.. మాటల కత్తులు దూయటం రాజకీయాల్లో చూస్తుంటాం. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి.. తర్వాతి కాలంలో పార్టీ తీరుపై గుర్రుతో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తాజాగా మాజీ బాస్ సోనియా మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించారు.
సోనియా ప్రమాణస్వీకారం చేయటానికి తన సీటు నుంచి వెల్ లోకి వెళుతున్న వేళ యూపీఏ మిత్రపక్షాల సభ్యులు అభినందిస్తూ బల్లలు చరిచారు. ఆశ్చర్యకరంగా అలా బల్లలు చరిచిన ఎంపీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉండటం గమనార్హం. తమ బాస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర చేయటాన్ని తప్పు పట్టి.. పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిన నేపథ్యంలో.. సోనియా ఆయన కుమారుడు రాహుల్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు నేటికి ఆగ్రహంతో ఉంటారు.
అలాంటి సోనియాగాంధీకి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బల్లలు చరచటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. గతంలో కాంగ్రెస్ లో ఉండి తర్వాత జగన్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కి షిఫ్ట్ అయిన వారు మాత్రమే బల్లలు చరిచారు. కాంగ్రెస్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమ కెరీర్ స్టార్ట్ చేసిన వారు మాత్రం అందుకు భిన్నంగా మౌనంగా ఉండిపోయారు.
ఈ ఉదంతాన్ని చూస్తే.. ఒకప్పటి మాజీ బాస్ విషయంలో నాటి కాంగ్రెస్ నేతలు.. నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ అభిమానాన్ని ప్రదర్శించారని చెప్పాలి. మరి.. ఈ బల్లలు చరిచిన విషయంలో తాజా బాస్ జగన్ కు తెలిస్తే ఎలా ఉంటుందో సదరు ఎంపీలు ఆలోచించారా?