పరిషత్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా అటు చిత్తూరు మొదలు కొని ఇటు శ్రీకాకుళం వరకు ఒకేలాంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఏపీ విపక్ష నేత చంద్రబాబు సొంతూరు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నకుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న తీరు చూస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా.. టీడీపీకి కంచుకోట లాంటి చోట్ల కూడా దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవటం షాకింగ్ గా మారింది. మొత్తం 515 జెడ్పీటీసీ స్థానాలు.. 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఓట్ల లెక్కింపు షురూ అయిన తర్వాత ఏ జిల్లాలో చూసినా అధికార వైసీపీ ప్రభంజనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేశ్ దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించటం చూస్తే..ఆ పార్టీని ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడా నమ్మలేదా? అన్న భావన కలుగక మానదు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోనూ వైసీపీ విజయం సాధించింది. ఇలాంటి సిత్రాలు తాజా ఫలితాల్లో చాలానే చోట్ల చోటు చేసుకుంది.
ఇదిలాఉంటే.. చాలా చోట్ల బ్యాలెట్ పెట్టెల్లో సీల్ చేసిన ఓట్లు చెదలు పడితే.. మరికొన్ని చోట్ల తడిచిపోయాయి. నెలల తరబడిఅలానే ఉంచటంతో.. బ్యాలెట్లలోని ఓట్లు దెబ్బతినటంతో ఓట్ల లెక్కింపు అధికారులకు కష్టంగా మారింది. చాలాచోట్ల చెదలు పట్టిన ఓట్లను అధికారులు పక్కన పెట్టేశారు.
చిత్తూరు జిల్లా
ఏపీలోని 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా కాస్త స్పెషల్. ఎందుకంటే.. విపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా. అలాంటి జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థులు తమ అధిక్యతను స్పష్టంగా చూపించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం జడ్పీసీని వైసీపీ విజయాన్ని సాధించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. ఆయన పుట్టిన నారావారి పల్లెలోనూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు.
కడప జిల్లా
వైఎస్సార్ కడప జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన అధిక్యతను స్పష్టంగా కనబర్చింది. మొత్తం యాభై స్థానాలకు ఇప్పటివరకు 40 స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది.చాలాచోట్ల క్లీన్ స్వీప్ సాధించిన పరిస్థితి.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు చూస్తే.. పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అధికార పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీని సొంతం చేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలోనూ పలు చోట్ల వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. టీడీపీ ఆస్తిత్వం కోసం పోరాడుతోంది.
కర్నూలు జిల్లా
రాయలసీమలోని మిగిలిన జిల్లాల మాదిరే కర్నూలు జిల్లాలోనూ అధికార వైసీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు. విపక్ష తెలుగుదేశం ఏ స్థాయిలోనే పోటీ ఇవ్వలేకపోతోంది. ఇప్పటికి వెల్లడైన ఫలితాల్లో అత్యధికం వైసీపీ అభ్యర్థులే విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు.
రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా కాకుండా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లా పేరు వేరు కానీ.. తుది ఫలితం మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా ఉండటం గమనార్హం. టీడీపీకి బలమైన నాయకులు ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పటివరకు (మధ్యాహ్నం 3 గంటల సమయానికి) అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. వైసీపీ 263 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ ఒక్క స్థానంలో గెలిచింది. ఎంపీటీసీ ఫలితాల్ని చూస్తే.. వైసీపీ 4617 స్థానాల్లో టీడీపీ 259 స్థానాల్లో విజయాన్ని సాధించగా.. బీజేపీ 20 స్థానాల్లో ఇతరులు 70 స్థానాల్లో విజయం సాధించారు. మరిన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.