ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చట్ట సభ్యులతో మాట్లాడుతూ... రష్యా చంపాలని అనుకుంటోందని అన్నారు. ఆ దేశ సైనికులు తొలి టార్గెట్ తనే అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ చనిపోతే ఉక్రెయిన్ పని అయిపోయినట్లు అని కొందరు భావిస్తున్నారు. అయితే దీనికి అమెరికా విదేశాంగ మంత్రి సరైన సమాధానాలు ఇచ్చారు. జెలెన్ స్కీ చనిపోయినా.. రష్యా పై ఉక్రెయిన్లలు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన యుద్ధం పన్నెండో రోజుకు చేరింది. రష్యా తన దైన శైలిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంది. ఇందుకు ఏ మాత్రం బెదరకుండా రాజధాని నగరం అయిన కీవ్ ను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా సైన్యం తనను చంపేందుకు ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అయితే జెలెన్ స్కీ నిజంగా చనిపోతే ఏం జరుగుతుంది అనే దానికి అమెరికా బదులు ఇచ్చింది.
ఒక వేళ జెలెన్‌స్కీ హత్య అనేది జరిగినా సరే ప్రభుత్వానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల దోయడం అంత సామాన్య విషయం కాదని ఆయన అన్నారు. ఇది చాలా అసాధారణమైన నాయకత్వం అని పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఉక్రెయిన్ కు పరిపాలన పరమైన మద్దతు ఇస్తామని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న అంశాలపై కూడా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికారులతో పాటు మంత్రితో కూడా తాము ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. ఇప్పటికే వాగ్నర్ గ్రూప్ అధ్యక్షుడ్ని హత్య చేసేందుకు రంగంలోకి దిగి విఫలం అయినట్లు అంతర్జాతీయంగా పలు కధనాలు వెలుగు చూసిన నేపథ్యంలో బ్లింకన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని రక్షించుకునేందుక పశ్చిమ దేశాలు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు చేస్తున్న యుద్ధం చాలా కాలం పాటు కొనసాగితే... పరిపాలన సౌలభ్యం కోసం అధ్యక్ష భవనాన్ని పాలన విభాగాలను పోలాండ్ కు తరలించేందుకు సిద్దంగా ఉన్నట్లు అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రష్యా సైనిక చర్యకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.