ఆ యువకుడి ఆస్తి రూ.2.7లక్షల కోట్లు

Update: 2015-08-21 04:44 GMT
నిండా 31 ఏళ్లు నిండలేదు. తల్లిదండ్రేలేమీ కుబేరులు కాదు. కానీ.. ఆ యువకుడు స్వశక్తితో.. సొంత ఆలోచనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. దేశాలకు అతీతంలో యువత మదిని దోచుకోవటమే కాదు.. తన ఆలోచనల్లో ఇరుక్కుపోయేలా చేసుకోవటమే కాదు.. దాని నుంచి బయటపడేలేని విధంగా తయారు చేశాడు. ఇంతకీ ఆ మహాఆకర్ష్ ఎవరంటారా? ఇంకెవరూ ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన అతగాడు.. మరో ఘనతను సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత యువ సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచాడు.

వెల్త్ ఎక్స్ విడుదల చేసిన తాజా జాబితాలో జుకర్ బర్గ్ ఈ రికార్డు సృష్టించాడు. జుకర్ బర్గ్ తో పాటు ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు దస్తిన్ మోస్కోవిట్జ్.. ఎడర్వర్డో సావెరిన్ లు కూడా ఈ జాబితాలో చోటు సాధించారు.  దస్తిన్ రెండో స్థానంలో నిలవగా.. సావెరిన్ నాలుగో స్థానంలోనిలిచారు. ఈ జాబితాలో పేర్కొన్న ప్రకారం మార్క్ జుకర్ బర్గ్ సంపద రూ.2.70లక్షల కోట్లు కాగా.. దస్తిన్ రూ.60వేల కోట్లు.. సావరిన్ రూ.34వేల కోట్లుగా ఉంది.

ఈ జాబితాలో పేర్కొన్న 35 ఏళ్ల లోపు సంపన్నుల్లో టాప్ ట్వంటీలో ఆరుగురు మహిళలు కూడా ఉండటం విశేషం. అయితే.. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఒక్కరూ ఉండకపోవటం గమనార్హం. ఈ యువ సంపన్నుల జాబితాలో టాప్ ట్వంటీలో 11 మంది అమెరికాకు చెందిన వారు ఉంటే.. చైనా.. హాంకాంగ్.. స్విట్జర్లాండ్ నుంచి ముగ్గురు చొప్పున ఉండటం గమనార్హం. ఇక.. పాతికేళ్ల లోపు సంపన్నుల జాబితాలో స్నాప్ చాట్ సీఈవో ఎవాన్ స్పీగెల్ (రూ.12,500కోట్లు) నిలిచారు.
Tags:    

Similar News