ఆర్సీబీని అంబటి రాయుడు అంత మాట అనేశాడేంటి?
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ మూడింట ఓడిపోయింది.
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ మూడింట ఓడిపోయింది. ఈ సీజన్ లో ఏ విషయంలోనూ ఆర్సీబీ ఆకట్టుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... రాయల్ ఛాలెంజర్స్ పై.. టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ మొత్తాలు తీసుకుంటున్న ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఒత్తిడికి లోనవుతుండటమే ఆర్సీబీ టైటిల్ కరవుకు కారణమని తెలిపాడు!
అవును... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టును ఉద్దేశించి అంబటి రాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... స్టార్ల ఫెయిల్యూర్ వల్లే ఆ టీం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని అన్నాడు. ఇదే సమయంలో... కోట్లకు కోట్లు తీసుకునే ఇంటర్నేషనల్ స్టార్స్ మైదానంలో కంటే డ్రెస్సింగ్ రూం లోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆ జట్టు రాత మారడం లేదని అభిప్రాయపడ్డాడు.
ఇదే క్రమంలో... బెంగళూరు బౌలర్లు ఎప్పుడు పరుగులు ఎక్కువగానే ఇస్తారని చెప్పిన రాయుడు... బ్యాటింగ్ విభాగం మాత్రం తక్కువ ప్రదర్శన చేస్తుందని అన్నాడు. ప్రధానంగా ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేస్తున్నవాళ్లంతా భారత యువ బ్యాటర్లు మాత్రమే అని చెప్పి.. ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అంతర్జాతీయ స్టార్ ప్లేయర్స్ అంతా ఎక్కడ ఉంటున్నారని ప్రశ్నించిన రాయుడు.. పదహారేళ్లుగా బెంగళూరుది ఇదే కథ అని.. ఐపీఎల్ లో విజేతగా నిలవకపోవడానికి ఇదే కారణం అని స్పష్టం చేశారు!
కాగా... విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుపెస్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా కూడా ఆర్సీబీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదనే కామెంట్లు నిత్యం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పరిస్థితి! ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న ఐపీఎల్ - 2024 లోనూ ఆ జట్టు పరాజయాల పరంపర కొనసాగిస్తోంది.
ఇందులో భాగంతా ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ కేవలం ఒక్కటే గెలిచింది. -0.876 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.