నిజంగా భారత క్రికెట్ జట్టు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని సగటు క్రికెట్ అభిమాని అస్సలు ఊహించి ఉండడు! ఇండియన్ టీమ్ కు గెలుపోటములు సహజమే కానీ.. ఇలా బంగ్లాదేశ్‌తో వైట్‌వాష్ ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని మాత్రం గత దశాబ్ద కాలంలో ఎవ్వరూ ఊహించి ఉండరు. మొన్నటి టీమ్ బంగ్లాదేశ్‌కు బయలు దేరినప్పుడు కానీ.. టెస్టు మ్యాచ్‌లో మనోళ్లు బాగా ఆడటాన్ని గమనించి కానీ ఎవ్వరూ కూడా వన్డే సీరిస్‌లో ఇండియా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని అంచనావేసి ఉండరు.
వరసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఇండియా బంగ్లాకు వన్డే సీరిస్ అప్పజెప్పింది. మరి ఇప్పుడు ఇప్పుడు మూడో వన్డేకు రంగం సిద్ధం అయ్యింది. ఈ వన్డేలో గనుక భారత్ గెలవకపోతే బంగ్లాదేశ్ వన్డే సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్టుగా అవుతుంది. ఇండియాను వైట్ వాష్ చేసిన ఘనతను సాధిస్తుంది.
మరి సమీపకాలంలోని ఫలితాలను చూస్తే ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ విధగా ఏ జట్టు చేతిలోనూ వైట్ వాష్ కాలేదు. ఆఖరికి ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో ఆడిన సందర్భాల్లో కూడా మనోళ్లు బాగానే రాణించారు. అయితే ఎటొచ్చీ బంగ్లాతోనే మనోళ్లు చిత్తయిపోతున్నారు.
బంగ్లా వెళ్లిన ఇండియన్ టీమ్‌ను చూసి మనోళ్లు ఆ దేశ క్రికెట్ జట్టును చిత్తు చేసి వస్తారని అందరూ అనుకొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అడ్డం తిరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే పెద్దగా ఒరిగేదేమీ లేదు. బంగ్లా చేతిలో సీరిస్ కోల్పోయిన జట్టుగానే నిలస్తుంది. కానీ ఓడితే మాత్రం అంతకన్నా అవమానం లేదు. అది ఏ భారత క్రికెట్ అభిమానీ కలలో కూడా కోరుకోని విషయం.