టీమిండియా హెడ్ కోచ్.. గంభీర్ కు బీసీసీఐ 3 కఠిన ప్రశ్నలు
వర్చువల్ గా పాల్గొన్న గంభీర్ ను 40 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీ సభ్యులు అతడిని మూడు కీలక ప్రశ్నలు అడిగారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, అత్యంత బలమైన జట్టు.. అత్యంత పాపులర్ లీగ్.. వీటన్నిటి మధ్య టీమిండియా హెడ్ కోచ్ అనేది ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో తెలిసిపోతుంది. ఇలాంటి కోచ్ పదవికి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖాయమైంది. జూలై 31తో ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కోచ్ నియామక ప్రక్రియ ముమ్మరమైంది.
టీమిండియా హెడ్ కోచ్ గా మంగళవారం గంభీర్ ను బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ చేసిది. వర్చువల్ గా పాల్గొన్న గంభీర్ ను 40 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసింది. ఈ కమిటీ సభ్యులు అతడిని మూడు కీలక ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలను స్పోర్ట్స్ చానెల్ బయటపెట్టింది.
కోచింగ్ పై మీ ఆలోచనలేంటి..?
కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?,
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొందరు సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు.. మార్పులు చేయాల్సిన పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? ఒక్కో ఫార్మాట్ కు ఒక్కో కెప్టెన్, వర్క్ లోడ్ కు అనుగుణంగా ఆటగాళ్ల ఫిట్ నెస్ పరిమితులు, ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో జట్టు వైఫల్యాలను ఎలా అధిగమిస్తారు? అనే అంశాలపై మీ అభిప్రాయాలు ఏంటీ? అని క్రికెట్ కమిటీ సభ్యులు గంభీర్ ను అడిగినట్లు తెలుస్తోంది.
గంభీర్ ను బుధవారం కూడా ఇంటర్వ్యూ చేయనున్నారు. గంభీర్ తో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకు పిలిచింది. 40 నిమిషాల పాటు మాట్లాడారు. వీరిలో గంభీర్ నే కోచ్ గా చేయడానికి బీసీసీఐ ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. రెండో రౌండ్ కూడా పూర్తయ్యాక గంభీర్ ను కోచ్ గా ప్రకటించే అవకాశం ఉంది.