ఆర్మీ ట్రైనింగ్ ఫెయిల్.. పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్ క్రికెటర్ల తిప్పలు

అయితే, మొన్నటి పరాజయం నుంచి బయటపడ్డ ఆ దేశ క్రికెటర్లు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మళ్లీ సాధన మొదలుపెట్టారు.

Update: 2024-07-04 16:30 GMT

అస్తవ్యస్త దేశవాళీ వ్యవస్థ.. సెలక్షన్ లో రాజకీయ ప్రమేయం.. ఇష్టారీతిన క్రికెటర్ల వ్యవహారం.. ఇదంతా పాకిస్థాన్ క్రికెట్ లో ఎప్పటినుంచో ఉన్న తీరు.. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఆ జట్టు దానికి తగిన ఫలితాలు సాధించలేకపోతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల పాక్ జట్టు ప్రమాణాలు బాగా పడిపోయాయి. వన్డే ప్రపంచ కప్ లో అఫ్ఘానిస్థాన్ చేతిలోనూ ఓడింది. కనీసం సెమీఫైనల్ కు కూడా చేరలేదు.తాజా టి20 ప్రపంచ కప్ లో అయితే పసికూన అమెరికా చేతిలో పరాభవం పాలైంది. దీంతోనే పాక్ జట్టు స్వదేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. క్రికెటర్లు ముందుగా పాక్ కు వెళ్లకుండా ఇంగ్లండ్ లో గడిపారు. కాగా, టి20 ప్రపంచ కప్ కోసం పాక్ ఆటగాళ్లకు ఆర్మీ తరహా ట్రైనింగ్‌ ఇచ్చారు. కొండలు ఎక్కడం (ట్రెక్కింగ్‌), అడవులు, నదుల్లో నడుస్తూ సాధన చేశారు. ఇదేమీ ఫలితం ఇవ్వలేదని ప్రపంచ కప్ ను చూస్తే తెలిసింది. యూఎస్‌ఏ, భారత్‌ చేతిలో ఓటమితో బాగా ట్రోలింగ్ జరిగింది. దీనికోసమేనా ఆర్మీ ట్రైనింగ్‌? అంటూ వెటకారమాడారు. అయితే, మొన్నటి పరాజయం నుంచి బయటపడ్డ ఆ దేశ క్రికెటర్లు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో మళ్లీ సాధన మొదలుపెట్టారు.

పాత పరుపులపై క్యాచింగ్..

పాకిస్థాన్ క్రికెటర్లు అంటే ఫీల్డింగ్ లో బాగా పూర్ అనే పేరుంది. క్యాచ్ లను నేలపాలు చేస్తుంటారని.. మ్యాచ్ లను జారవిడుస్తుంటారని చెబుతుంటారు. బహుశా దీనిని నివారించేందుకేనేమో.. కొత్త తరహా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వారు క్యాచ్‌ లు ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలను చూస్తే.. పాత పరుపులను గ్రౌండ్ లో పరిచినట్లు తెలుస్తోంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఆ పరుపుల మీద డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకుంటున్నాడు. అయితే, ఇది కూడా వ్యంగ్యం విమర్శలకు దారితీస్తోంది. ‘బంతి ఎప్పుడైనా సరే.. ఇద్దరు ఫీల్డర్లకు దగ్గరగా వెళ్తేనే మా వాళ్లు అందుకోవడానికి ఇలా ప్రయత్నిస్తారు’’‘‘పీసీబీ..? ఇదే నిర్ణయం.. ఆటగాళ్లు మరింత చులకన అవుతారు. ప్రపంచ కప్‌ ముందు కూడా ఇలాంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా మార్పు రాలేదు’’‘‘ఇదో జోక్.. ప్రపంచంలో క్రికెట్‌ ధనిక క్రీడ. పాకిస్థాన్ లాంటి జట్టు ఆటగాళ్లు ప్రొఫెషనల్స్‌. ఇలా పాత బెడ్‌లపై ప్రాక్టీస్‌ ఏంటి? తరువాత మ్యాచ్ లకు మైదానమంతా వీటితోనే నింపేస్తారేమో’’‘‘దీనికంటే మైదానంలోని గడ్డి మీద డైవ్ బెటర్. లేదంటే క్రికెట్‌ లో మళ్లీ సక్సెస్ కావడం కష్టమే’’అంటూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.

Tags:    

Similar News

eac