లక్నోని "ఫ్రెజర్" లో పెట్టేసిన కుల్దీప్ మాయ... ఢిల్లీ విక్టరీ!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్ నెంబర్ 26... లక్నో - ఢిల్లీ మధ్య జరిగింది.

Update: 2024-04-13 04:23 GMT

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మ్యాచ్ నెంబర్ 26... లక్నో - ఢిల్లీ మధ్య జరిగింది. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఆధ్యంతం ఈ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందనేది ఇప్పుడు చూద్దాం..!

లక్నో బ్యాటింగ్ స్టార్ట్!:

డికాక్‌, కేఎల్‌ రాహుల్ లు బ్యాటింగ్ కి దిగారు. ఈ సందర్భంగా.. ఖలీల్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతినే డికాక్‌ ఫోర్‌ గా కొట్టగా.. నాలుగో బంతికి 2 రన్స్‌ వచ్చాయి. చివరి బంతికి మళ్లీ ఫోర్‌ కొట్టడంతో తొలి ఓవర్ వికెట్లేమీ నష్టపోకుండా 10 పరుగులు సాధించారు.

ఇదేక్రమంలో.. ఇషాంత్‌ శర్మ వేసిన రెండో ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

లక్నో ఫస్ట్ వికెట్ డౌన్!:

ఖలీల్‌ వేసిన 2.5 ఓవర్‌ కు డికాక్‌(19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో... మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు ఒక వికెట్ నష్టానికి 28 పరుగులకు చేరింది.

లక్నో సెకండ్ వికెట్ డౌన్!:

ఖలీల్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతికి పడిక్కల్‌ (3) ఔటయ్యాడు. మరోవైపు రాహుల్‌ (21) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో.. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయిన లక్నో 47 పరుగులు చేసింది.

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు!:

కుల్దీప్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లో లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్ లో మూడో బంతికి స్టాయినిస్‌(8) ఇషాంత్‌ కి క్యాచ్‌ ఇవ్వగా... ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పూరన్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో లక్నో స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 67 పరుగులకు చేరింది.

సగం ఓవర్లకు సగం వికెట్లు!:

కుల్దీప్‌ వేసిన పదో ఓవర్‌ మూడో బంతికి కెప్టెన్‌ రాహుల్‌ (39) ఔటయ్యాడు. దీంతో సగం ఓవర్లు పూరయ్యే సరికి సగం వికెట్లు కోల్పోయిన లక్నో 80 పరుగులు చేసింది.

లక్నో వరుస వికెట్లు పతనం!:

ఇషాంత్‌ వేసిన 12 ఓవర్‌ ఐదో బంతికి హుడా(10) ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లకు లక్నో స్కోర్‌ 90/6.

ముకేష్ వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి కృనాల్‌ పాండ్య (3) ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 7 వికెట్ల నష్టానికి 94 పరుగులకు చేరింది.

బదోనీ హాఫ్ సెంచరీ!:

కష్టాల్లో ఉన్న లక్నో ను బదానీ ఆదుకున్నాడు. ముకేశ్‌ వేసిన 19వ ఓవర్‌ లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఈ సమయంలో బదానీ హాఫ్ సెంచరీ పూర్తయ్యింది.

ఇక ఇషాంత్ శర్మ వేసిన 20వ ఓవర్లో 11 పరుగులురావడంతో... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన లక్నో 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్ లో బదోనీ 55* (35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ 39 (22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించారు.

ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ 3, ఖలీల్‌ 2, ఇషాంత్‌, ముకేశ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ!:

168 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్‌ కు దిగింది. ఈ సందర్భంగా క్రీజ్ లోకి ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్‌ ఎంటరయ్యారు. ఈ క్రమంలో అర్షద్‌ వేసిన తొలి ఓవర్‌ లో 7 పరుగులు వచ్చాయి.

అనంతరం నవీన్‌ వేసిన రెండో ఓవర్లో పృథ్వీ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. తర్వాత అర్షద్‌ వేసిన మూడో ఓవర్‌ లో 6 పరుగులు వచ్చాయి. దీంతో... మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

ఢిల్లీ ఫస్ట్ వికెట్ డౌన్!:

యశ్‌ వేసిన నాలుగో ఓవర్‌ లో మూడో బంతికి వార్నర్‌ (8) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌ గర్క్‌ (6) ఐదో బంతిని సిక్స్‌ గా మలిచాడు. దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 30 పరుగులకు చేరింది.

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ!:

కృనాల్‌ వేసిన ఆరో ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు విరుచుకుపడిపోయారు. ఇందులో భాగంగా... ఆ ఓవర్ లో 17 పరుగులు సాధించారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ స్కోరు ఒక వికెట్ నష్టానికి 62 పరుగులకు చేరింది.

ఈ సమయంలో... రవి బిష్ణోయ్‌ వేసిన ఏడో ఓవర్‌ చివరి బంతికి పృథ్వీ (32) ఔటయ్యాడు. పైగా ఈ ఓవర్ లో ఒక్క పరుగే వచ్చింది. దీంతో 7 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 63కి చేరింది.

దూకుడు పెంచిన ఢిల్లీ బ్యాటర్లు!:

10 ఓవర్లు ముగిసే వరకూ డల్ గా ఉన్న ఢిల్లీ కాస్త జోరందుకుంది. ఇందులో భాగంగా... 11 ఓవర్లో పంత్ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది 15 పరుగులు రాబట్టగా.. 12 ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అప్పటికి ఢిల్లీ విజయానికి 48 బంతుల్లో 68 పరుగులు అవసరం అయ్యాయి!

ఇదే క్రమంలో 13వ ఓవర్ లో జేక్ ఫ్రేజర్‌ వరుసగా మూడు సిక్స్ లు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో 21 పరుగులు వచ్చాయి. ఈ సమయంలోనే ఫ్రేజర్ ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకుని నవీనుల్‌ హక్‌ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. అప్పటికి ఫ్రేజర్ వ్యక్తిగత స్కోరు (55: 35 బంతుల్లో)!

దూకుడుమీదున్న పంత్‌ ఔట్‌!:

రవి బిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి పంత్‌ (41) ఔటయ్యాడు. ఈ సమయంలో ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి.

లక్నోపై ఢిల్లీ విజయం!:

18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌ లో అర్ధశతకం చేసిన జేక్‌ ఫ్రేజర్‌ (55: 35 బంతుల్లో 5 సిక్స్‌ లు, 2 ఫోర్లు), పంత్‌ (41: 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీంతో... కుల్దీప్‌ యాదవ్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ దక్కింది!

Tags:    

Similar News