ఆ లిస్ట్ లో కొహ్లీతో పాటు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్!
ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై వరుసగా 113, 166* పరుగులతో రెండు సెంచరీలు నాలుగు రోజుల వ్యవధిలో సాధించాడు కొహ్లీ.
మంచినీళ్ల ప్రాయంగా శతకాలు సాధిస్తాడు అనే పేరు సంపాదించుకున్న కోహ్లి కూడా ఒక దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రెండున్నరేళ్ల పాటు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ప్రత్యేకంగా కొవిడ్ రోజుల్లో ఖాళీ స్టేడియాల్లో ఆడటం ఇబ్బందిగా మారిందనఏ కామెంట్లు వినిపించాయి. ఆ సమయంలో విరాట్ పనైపోయిందని చాలామంది స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు. కానీ కోహ్లి తిరిగి ఫాంలోకి వచ్చాడు.
అవును... కోవిడ్ సమయంలో పేలవ ఫాం తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ ఆ సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు బాదిన వారి జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభం నుంచీ తనదైన ఫాం కొనసాగించిన కొహ్లీ ఇప్పటివరకూ 6 సెంచరీలు సాధించాడు.
ఈ ఏడాది జనవరిలో శ్రీలంకపై వరుసగా 113, 166* పరుగులతో రెండు సెంచరీలు నాలుగు రోజుల వ్యవధిలో సాధించాడు కొహ్లీ. ఇలా ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో సెంచరీల బోణీ చేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ లో పాకిస్థాన్ పై 122* తో మరో సెంచరీ చేసిన కొహ్లీ.. అక్టోబర్ లో బంగ్లాదేశ్ (103*), నవంబర్ లో సౌతాఫ్రికాపై (101*) సెంచరీలు సాధించాడు. అది కొహ్లీ కెరీర్ లో 49వ సెంచరీ కావడం గమనార్హం.
ఈ క్రమంలో తాజాగా వరల్డ్ కప్ సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ పై 117 పరుగులతో తన 50వ సెంచరీని సాధించాడు. ఫలితంగా.. వన్డే ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ గా రికార్డ్ సాధించాడు. ఇలా ఆరు సెంచరీలతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
ఇక ఈ లిస్ట్ లో కొహ్లీ తర్వాత స్థానంలో టీం ఇండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్, డారెల్ మిచెల్ లు ఐదేసి సెంచరీలతో ఉండగా... ఆ తర్వాత స్థానాల్లో వరుసగా... డేవిడ్ మలాన్ (4), క్వింటన్ డికాక్ (4), డెవాన్ కాన్వే (4), ఫఖర్ జమాన్ (4), రచిన్ రవీంద్ర (4), టెంబా బవుమా (3), శ్రేయస్ అయ్యర్ (3) ఉన్నారు.