ISPL ముంబై జట్టు ఓనర్ మన మెగాస్టార్?
భారతదేశంలో బిగ్గెస్ట్ స్టార్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలో భాగమవుతున్నారు. ఇప్పుడు ముంబై జట్టు యజమానిగా మెగాస్టార్ ISPLలో చేరారు
భారతదేశంలో బిగ్గెస్ట్ స్టార్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలో భాగమవుతున్నారు. ఇప్పుడు ముంబై జట్టు యజమానిగా మెగాస్టార్ ISPLలో చేరారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది.
లీగ్‌తో తన అనుబంధం గురించి అమితాబ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసరాల్లో తాను ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ''ఐఎస్‌పిఎల్-ది స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ తో భాగస్వామ్యంలో దీక్ష, ధైర్యం, శ్రద్ధ, భావనతో నిండిన మనసు ఎంతో ఉత్తేజకరమైనది.. అత్యంత గొప్పది'' అని క్యాప్షన్‌లో రాశారు.
''వీధుల్లో గల్లీల్లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి... క్రికెట్ ఆడేందుకు షిఫ్ట్ హోమ్ మేడ్ పిచ్‌లను తయారుచేసే వారికి.. ఇప్పుడు వృత్తిపరంగా జట్టుకు ఎంపికై ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముందు అధికారిక సెటప్‌లలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశం. ముంబయి జట్టు యజమానిగా ఉండటం ప్రతిభను చాటుకోవడం, గొప్ప దార్శనిక భవిష్యత్తు కోసం గోప్యంగా ఉండటం నాకు గౌరవం అలాగే ఎంతో ప్రత్యేకత''అన్నారు.
ISPL భారతదేశం మొదటి టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ స్టేడియం లోపల ఆడతారు. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ అనే ఆరు జట్ల లైనప్‌తో 19 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో శ్రీనగర్ జట్టును బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. లీగ్ ప్రారంభ ఎడిషన్ మార్చి 2 నుండి మార్చి 9 వరకు ముంబైలో జరగనుంది. అమితాబ్ తదుపరి దక్షిణాది అగ్ర హీరోలతో కలిసి పలు మల్టీస్టారర్లలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదే సమయంలో హిందీ చిత్రసీమలో క్రేజీ చిత్రాల్లో నటించనున్నారు. మరోవైపు కేబీసీ హోస్ట్ గాను అతడు సుదీర్ఘ కాలం తన హోదాను కాపాడుకుంటున్న సంగతి తెలిసిందే.