ఇండియాతో మ్యాచ్ రద్దు... పాక్ లో ఇళ్లలో టీవీలు బతికిపోయాయి!
ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆధరణ సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా ఈ దేశంలో క్రికెట్ ఒక కులం, ఒక మతం అని చెప్పినా అతిశయోక్తి కాదు! అలాంటి ఇండియా.. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఇంక చెప్పేపనేలేదు.
ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆధరణ సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా ఈ దేశంలో క్రికెట్ ఒక కులం, ఒక మతం అని చెప్పినా అతిశయోక్తి కాదు! అలాంటి ఇండియా.. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఇంక చెప్పేపనేలేదు. ఈ రెండు దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు అది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అన్నిచెప్పుకున్నా అతిశయోక్తి కాదు.
ఈ క్రమంలో తాజాగా ఆసియా కప్ లో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ డేట్ ఫిక్సయ్యింది. ఆ డేట్ & టైం కోసం ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు వరుణుడు అస్తమానం టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఆటంకం కలిగిస్తూనే ఉన్న వరుణుడు... తొలుత భారత్ ఇన్నింగ్స్ కు రెండుసార్లు అంతరాయం కలిగించాడు.
ఈ క్రమంలో వర్షం తర్వాత ఇండియన్ టాప్ ఆర్డర్ తడబడింది. పిచ్ సహకరించలేదో.. ప్రిపరేషన్ లో లోపమో తెలియదు కానీ... టా ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఇలా కష్టాల్లో ఉన్న భారత్ కు ఇషాన్ కిషన్ (82), హార్దిక్ పాండ్య (87)లు సహకారం అందించారు. బాధ్యత తీసుకున్నారు.. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు! దీంతో టీం ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.
పాక్ బౌలర్లు ఎదురు నిలిచిన మిడిల్ ఆర్డర్:
మ్యాచ్ ఆరంభంలో భారత టాప్ ఆర్డర్లు కాస్త దూకుడు ప్రదర్శించినట్లు అనిపించినా... అనంతరం పాక్ సీమర్స్ ఆధిపత్యం ప్రదర్శించారు. తమదైన స్వింగ్ తో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో... రోహిత్ శర్మ (11), శుభ్ మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) లు విఫలమయ్యారు.
దీంతో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. స్టేడియం లో ఉన్నవాళ్లు, టీవీల ముందు అతుక్కుపోయిన ఇండియన్స్ ముఖాల్లో నీరసం, భయం మేలవింపు దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్ (82), హార్దిక్ పాండ్య (87) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ లు ఆడి ఆదుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ లేకుండా చేసిన వరుణుడు:
భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా.. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం కే పరిమితమయ్యారు. కాసేపటి తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ నిర్వహణకు రెడీ చేశారు. ఈ సమయంలో ఆటగాళ్లు గ్రౌండ్ లోకి అడుగుపెడుతుండగా మళ్లీ చిన్నగా మొదలైన వర్షం... మరింత ఎక్కువైంది. దీంతో... మ్యాచ్ రద్దయ్యింది!
ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ వైరల్:
సాధారణంగా చాలా మంది క్రికెట్ అభిమానులు... ఇండియా – పాక్ మ్యాచ్ ని యుద్ధంలా చూస్తారనేది తెలిసిన విషయమే. ఈ విషయంలో గతంలో భారత్ చేతిలో పాక్ ఓడిపోయిన సమయాల్లో ఆ దేశంలోని చాలా మంద్రి క్రికెట్ అభిమానులు టీవీలు పగులగొట్టేవారు. ఈ సమయంలో తాజాగా ఈ మ్యాచ్ రద్దవ్వడంపై పఠాన్ స్పందించాడు.
అవును... ఫలితం లేకుండా ఇండియా - పాక్ మ్యాచ్ రద్దవ్వడంపై టీమిండియా మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్ ఒక ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "ఈ రోజు పాకిస్తాన్ లో చాలామంది ఇళ్లలో టీవీలు బతికిపోయాయి" అని పఠాన్ ట్వీట్ చేశాడు. దీంతో... ఈ ట్వీట్ వైరల్ గా మారింది!