బెంగళూరు వర్సెస్ లక్నో... ఈ మ్యాచ్ లో అతడే స్పెషల్ అట్రాక్షన్!

ప్రస్తుతం ఈ సీజన్ లో ప్రధానంగా ఒక యువ ఫేసర్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Update: 2024-04-02 03:50 GMT

ప్రపంచానికి పరిచయం కాని గొప్ప గొప్ప ట్యాలెంటెడ్ ప్లేయర్స్ వెలుగులోకి రావడానికి ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుందనేది తెలిసిన విషయమే. ప్రధానంగా మట్టిలో మాణిక్యాలు అన్నట్లుగా కొంతమంది ఆటగాళ్లు తలుక్కున మెరుస్తున్నారు. దీంతో ఒక్కసారిగా వారి పెర్ఫార్మెన్స్ తో పాటు వారి ప్లాష్ బ్యాక్ కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం ఈ సీజన్ లో ప్రధానంగా ఒక యువ ఫేసర్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అతడే మయాంక్ యాదవ్!

అవును... గంటకు 155.8 కి.మీ వేగంతో బంతులు వేస్తున్నాడు ఒక యువ ఫాస్ట్ బౌలర్. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన ఢిల్లీకి చెందిన మయాంక్... తనదైన వేగంతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా విసిరిన బంతుల్లో ఒకటి ఇప్పుడు ఇతడి పేరుమీద ఉంది. వేగమే కాదు కశ్చితత్వం కూడా మయాంక్ సొంతం అని చెప్పడానికి పంజాబ్ పై అతడు నమోదు చేసిన ఘణాంకాలే సాక్ష్యం!

పంజాబ్ పై జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు బౌల్ చేసిన ఈ యువ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్... 12 డాట్ బాల్స్ వేసి 27 పరుగులు ఇచ్చాడు. అంతకంటే ప్రధానంగా... 3 వికెట్లు తీసి పంజాబ్ టాప్ ఆర్డర్ ని పెవిలియన్ కు పంపాడు. దీంతో... ఆ వేగం, ఈ కచ్చితత్వం ఫలితంగా... ఇప్పుడు అందరికళ్లూ అతడిపైనే ఉన్నాయి. నేడు రాయల్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ లో మరోసారి మైదానంలోకి దిగబోతున్న మయాంక్... ఏ స్థాయిలో బౌలింగ్ చేస్తాడనేది వేచి చూడాలి!

తాజాగా తన సూపర్ ఫాస్ట్ బౌలింగ్ పై స్పదించిన మయాంక్... ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్ గా కంటే.. ఉత్తమ బౌలర్ గా ఎదగాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో... మూడేళ్లుగా లక్నో టీంలో ఉన్నాప్పటికీ తొలి ఏడాది ఆడే అవకాశం దక్కలేదు.. రెండో ఏడాది గాయం కారణంగా దూరం.. ఈ క్రమంలో ఇప్పుడు అందివచ్చిన తొలి అవకాశాన్ని సధ్వినియోగం చేసుకున్నట్లు తెలిపాడు. తనకు కెప్టెన్ రాహుల్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నాడు.

ఇక మయాంక్ నేపథ్యం విషయనికొస్తే... అతడి తండ్రి ప్రభు యాదవ్ చిరు వ్యాపారి. అయితే... తనయుడికి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఆయన.. చిన్నప్పుడే మయాంక్ ని ఈ ఆటలో ప్రోత్సహించాడు. అయితే.. క్రికెట్ పై వెచ్చించేంత స్థోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో.. ఒకానొక సమయంలో బూట్లు కూడా లేకుండా ఇబ్బంది పడ్డాడు. అయితే... ఆరడుగుల ఎత్తున్న మయాంక్.. సోనెపట్ క్లబ్ లో చేరిన తర్వాత ఫేస్ బౌలర్ గా ఎదిగాడు.

Tags:    

Similar News