నితీశ్ సెంచరీ తర్వాత ‘బాహుబలి’ స్టైల్ ఎందుకో తెలుసా?

మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా పెర్ఫార్మెన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-30 04:00 GMT

మెల్ బోర్న్ వేదికగా ఆసిస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు చర్చ అంతా నితీశ్ కుమార్ చేసిన పరుగుల గురించే అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో నితీశ్ పెర్ఫార్మెన్స్ ఉందని అంటున్నారు సీనియర్లు, జూనియర్లు, దిగ్గజాలు, కామెంటేటర్లు! క్రీడా ప్రపంచం నుంచే కాకుండా.. ఇతర రంగాల ప్రముఖుల నుంచి నితీశ్ కు ప్రశంసలూ దక్కుతున్నాయి.

నితీశ్ స్టైల్ ఆఫ్ షాట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు. టెస్ట్ క్రికెట్ లో బ్యాటర్ ఆడే షాట్స్ కంటే వదిలేసిన బాల్స్ అతని బ్యాటింగ్ స్కిల్స్ కి అద్దం పడుతుంటాయని అంటుంటారు. ఈ విషయంలో నితీశ్ రెడ్డికి మంచి మార్కులు ఇస్తున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన నితీశ్.. స్నిగ్నేచర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా పెర్ఫార్మెన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి సెంచరీని సాధించిన నితీశ్.. భారత్ ను ఫాలో-ఆన్ ముప్పు నుంచి కాపాడాడు. ఈ సందర్భంగా నితీశ్ చూపించిన ఆటతీరుకు క్రీడా ప్రపంచం నుంచి ప్రశంసల జల్లులు కురుస్తోన్నాయి.

ఇక ప్రధానంగా హాఫ్ సెంచరీ, సెంచరీ తర్వాత నితీశ్ చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇందులో భాగంగా... 'పుష్ప' స్టైల్ లో హాఫ్ సెంచరిని సెలబ్రేట్ చేసిన నితీశ్.. 'బాహుబలి' స్టైల్ తో సెంచరీకి మరింత కలర్ యాడ్ చేశాడు. ఇందులో భాగంగా.. హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్ తో చేసిన పుష్ప సిగ్నేచర్ తో ఇకపై "తగ్గేదేలే" అని చెప్పకనే చెప్పాడని అంటున్నారు.

ఈ సందర్భంగా సెంచరీ తర్వాత చెసిన "బాహుబలి" స్టైల్ పై స్పందించిన నితీశ్... సెంచరీ తర్వాత తన బ్యాట్ ను నేలపై నిలబెట్టి, హెల్మెట్ ను దానిపై ఉంచగా.. హెల్మెట్ పై జాతీయ జెండా ఉందని.. అది నా దేశానికి వందనం చేసినట్లుగా ఉంటుందని వెల్లడించాడు. ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో స్థిరస్థాయిగా నిలుస్తుందని తెలిపాడు.

Tags:    

Similar News