పాకిస్తాన్‌కు షాక్.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మారింది!
ఐసీసీ కప్ నిర్వహించేందుకు ఆతిథ్య దేశంలో ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారీ షాక్ తగలనుందా? అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఐసీసీ చాపింయన్స్ ట్రోఫీని నిర్వహించాలని భావించిన ఆదేశానికి నిరాశే ఎదురు కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు రాజకీయ పరమైన సమస్యలతో పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి తమ జట్లను పంపించేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోపీ కప్‌ను నిర్వహించేందుకు దుబాయ్ సరైన వేదికగా తెరమీదికి వచ్చింది. ఇది పాకిస్తాన్‌కు ఊహించని దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు.
ఒప్పందం కుదరడం కష్టమే!
ఐసీసీ కప్ నిర్వహించేందుకు ఆతిథ్య దేశంలో ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ విషయంలో పాకిస్తాన్‌ను అనుకున్నారు. ఇదే విషయాన్ని కొన్నాళ్ల కిందట ఐసీసీ ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌లోనే ఈ మ్యాచ్‌లు జరుగుతాయని అందరూ భావించారు. అయితే..అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించినఇతర దేశాలు(భారత్ సహా) తమ జట్లను భద్రతా కారణాలతో పాకిస్థాన్‌కు పంపించేందుకు ఇష్టపడడం లేదని ఐసీసీకి తెలిసింది. ఈ నేపథ్యంలో ఒప్పందం విషయం పెండింగ్ లో పడింది.
వెళ్లకపోతే ఏంటి?
అయితే.. పాకిస్తాన్ మాత్రం వెంటనే ఒప్పందం చేసుకోవాలని ఐసీసీని కోరుతున్నట్టు సమాచారం. ఈ ఒప్పందం కుదరాల్సి ఉంది. ఒకవేళ పాకిస్తాన్‌తో ఐసీసీ ఒప్పందం చేసుకుంటే ఆయా దేశాలు విధిగా వెళ్లవలసి ఉంటుంది. లేని పక్షంలో ఐసీసీ విధించే జరిమానా చెల్లించాలి.
భారత్ వర్సెస్ పాక్.. ఇరువైపులా పంతం!
ఐసీసీపై భారత్, పాకిస్తాన్‌లు తమ పంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలో ఐసీసీకి ఆతిథ్యం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు పట్టుదలగా ఉంది. ఇలా అయితే.. తమ జట్టును పాకిస్తాన్ పంపడంపై అనుమానమేనని భారత్ చెబుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఐసీసీ వివాదం ముదురుతోందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జకా అష్రఫ్, సిఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు. టీమ్ఇండియా పాక్‌కు రానంటే ఏ చేయాలన్న దానిపై వీరు చర్చించారు. అయితే.. ఐసీసీ పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ కోరింది.
ఆసియా కప్‌లోనూ ఇంతే!
ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 'ఆసియా కప్'కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే.. భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో భారత్ ఆడే అన్ని మ్యాచులను శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఆ తరువాత జరిగిన వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరిగింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించింది. అయితే.. ఆ తరువాత జరిగిన పరిణాల నేపథ్యంలో ఆ జట్టు భారత్‌కు వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి.