రాహుల్ ద్రావిడ్ : డబ్బెవరికి చేదు !

అయితే ఈ నజరానాను రాహుల్ హుందాగా తిరస్కరించాడు. నాకు రూ.5 కోట్లు అక్కర్లేదు. అందరు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మాదిరే రూ.2.50 కోట్లు అందించాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తుంది.

Update: 2024-07-10 05:57 GMT

డబ్బెవరికి చేదు అని 1980వ దశకంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక సినిమా వచ్చింది. తన పిల్లల ప్రేమ స్వచ్ఛమైనదా ? లేక డబ్బుకోసమా ? అన్నదే ఆ చిత్ర కథాంశం. కానీ నిజ జీవితంలో డబ్బును వద్దనే వారు అత్యంత అరుదుగా ఉంటారు. అటువంటి కోవకు చెందిన వాడే మన ప్రముఖ క్రికెటర్, కోచ్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్.

2024 టీ 20 వరల్డ్ కప్ భారత్ గెలవడంలో కోచ్ గా కీలకపాత్ర పోషించాడు రాహుల్ ద్రావిడ్. వరల్డ్ కప్ గెలుపుకు బహుమతి రూ.125 కోట్లు భారతజట్టుకు లభించాయి. దీంతో కోచ్ గా వ్యవహరించిన రాహుల్ కు బీసీసీఐ రూ.5 కోట్లు నజారానా అందజేసింది.

అయితే ఈ నజరానాను రాహుల్ హుందాగా తిరస్కరించాడు. నాకు రూ.5 కోట్లు అక్కర్లేదు. అందరు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మాదిరే రూ.2.50 కోట్లు అందించాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తుంది. గతంలో 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా బీసీసీఐ రాహుల్ కు రూ.50 లక్షలు ఇవ్వగా దాన్ని సున్నితంగా తిరస్కరించి రూ.20 లక్షలు మాత్రమే తీసుకున్నాడు. దీంతో బీసీసీఐ అందరికీ రూ.25 లక్షల చొప్పున అందివ్వడం విశేషం.

Tags:    

Similar News