‘బాడీ షేమింగ్’తో రోహిత్ వాయిస్.. పాక్ ఫ్రాంచైజీ పై ఫ్యాన్స్ ఫైర్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.;
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా షామా వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగతంగా ప్రకటించింది. మరోవైపు తనపై విమర్శలకు సమాధానమా? అన్నట్లుగా రోహిత్ చాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించాడు. దీంతో అందరి నోళ్లూ మూతపడ్డాయి.
తాజాగా రోహిత్ శర్మను ఉద్దేశిస్తూనా అన్నట్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫ్రాంచైజీ ఒకటి దారుణంగా ప్రవర్తించింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి అప్పుల పాలు కావడమో..? తమ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా దారుణంగా ఇంటికి చేరడమో..? ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ కు పాక్ ప్రతినిధులను పిలవకపోవడమో.. అన్నిటికి మించి భారత్ విజేతగా నిలవడమో..? కానీ పాకిస్థాన్ కు కడుపు రగిలిపోతున్నట్లుంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ భారత కెప్టెన్ రోహిత్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. రోహిత్ వాయిస్ ను.. తమ మస్కట్ కు జత చేసింది. తాజాగా ఆ ఫ్రాంచైజీ ఈ మేరకు షేర్ చేసిన వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కాగా ఇప్పటికే పీఎస్ఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చాంపియన్స్ ట్రోఫీ కారణంగా వచ్చే నెల 11 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్స్ మస్కట్ విడుదల చేసింది.
ఇందులో లావుగా ఉన్న ముల్తాన్ మస్కట్.. విలేకరులతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియో వాయిస్ ఓవర్ మాత్రం రోహిత్ శర్మది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మరీ ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిస్ ను ముల్తాన్స్ మస్కట్ కు దించేశారు.
నిర్వహించాడు. ఇది రోహిత్ ను ‘బాడీ షేమింగ్’ చేసినట్లేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ ఇంగ్లిష్ ను ఆస్ట్రేలియా ఆటగాడు బ్రాడ్ హాగ్ ఇమిటేట్ చేయగా.. పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిప్పుడు రోహిత్ విషయంలో ముల్తాన్ ఫ్రాంచైజీ చేసిన పనేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించిపెట్టిన కెప్టెన్ పై బాడీ షేమింగ్ చేస్తారా? రోహిత్ వాయిస్ ను తీసేయండి.. చైతనైతే ఒక్క ట్రోఫీనైనా గెలవండి అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.