ముంబై కెప్టెన్ గా రోహిత్!... తాజా భేటీ అప్ డేట్ ఇదే!
అవును... ఐపీఎల్ సీజన్ 17లో ముంబై జట్టు పేళవమైన ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొనసాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ అధ్వాన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ముంబై జట్టు ఓటమిపాలైంది. అయితే.. ఈ ఘోరమైన ఫలితాలకు కారణం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మాత్రమే అంటూ చాలా మంది నేరం అతనిపై వేసే ప్రయత్నం చేస్తుండగా.. టీంలో ప్లేయర్లు కూడా సరైన ఫాం లో లేకపోవడమే కారణం అని అంటున్నారు.
అవును... ఐపీఎల్ సీజన్ 17లో ముంబై జట్టు పేళవమైన ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసి వరుసగా డకౌట్ లు అవుతూ 125 పరుగులకే ఆలౌట్ అవుతున్నా కూడా పాండ్యాపైనే నెపం వేస్తున్నారని చెబుతున్నారు. పైగా మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ ఎంఐ ఫ్యాన్స్ నుంచి పాండ్యాకు తీవ్ర ట్రోలింగ్ మొదలవుతోంది. ఇది కూడా అతడిపై ఒత్తిడికి కారణం అవుతుందని అంటున్నారు.
వాస్తవానికి కెప్టెన్ మారినంత ఏదో మారిపోయిందని కూడా అనుకోలేమని చెబుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు పరిశీలకులు! అక్కడ రుతురాజ్ కి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చిన నేపథ్యంలో... అతడి ఆలోచనలకు ధోనీ అనుభవం కూడా తోడవ్వడంతో బెస్ట్ ఫెర్మార్మెన్స్ దొరుకుందని.. ముంబై లో పాండ్యాకు రోహిత్ నుంచి అటువంటి సహకారం లభించడంలేదనే వాదనా వినిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో... ముంబై కెప్టెంగా రోహిత్ శర్మను తిరిగి తీసుకొచ్చే అవకాశాలున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి! ఇందులో భాగంగా... ముంబై ఇండియన్స్ యాజమాన్యం, టీం మేనేజ్మెంట్ కలిసి ప్రస్తుతం టీం ఉన్న ఫాం తో పాటు ఐపీఎల్ లో ఐదు సార్లు ఎంఐ ని విజేతగా నిలిపిన రోహిత్ శర్మ ను తిరిగి కెప్టెన్ గా నియమించే విషయంపైనా సమాలోచనలు చేసినట్లు కథనాలొస్తున్నాయి!
ఇదే క్రమంలో... రోహిత్ ను తిరిగి కెప్టెన్ గా తీసుకోవాలనే విషయంపై ముంబై నాయకత్వం ఆలోచించే అవకాశం ఉందని సీనియర్ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించాడు. రోహిత్ కెప్టెన్ గా తిరిగి రావడంపై తన వాదనకు బలం చేకూర్చేలా, ప్రేక్షకుల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా హార్దిక్ మూడవ మ్యాచ్ లో బౌలింగ్ చేసే స్థితిలో కూడా లేడని తివారీ అబిప్రాయపడుతున్నాడు.
కాగా... గతంలో చెన్నై సూపర్ కింగ్స్ గతంలో జడేజా నుండి ధోనీకి కెప్టెన్సీ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఏడాది ముంబై కూడా ఈ తరహాలోనే ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి!