48 ఏళ్ల వయసులో తండ్రైన పాక్ స్టార్ క్రికెటర్
48 ఏళ్ల వయసులో ఈ మాజీ స్టార్ క్రికెటర్ తండ్రి కావడం హాట్ టాపిక్ గా మారింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ పేస్ బౌలర్, కామెంట్రేటర్ షోయబ్ అక్తర్ గురించి క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేదు. మైదానంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే రావుల్పిండి ఎక్స్ ప్రెస్...మైదానం వెలుపల కూడా అదే వేగంతో మాటలు విసురుతూ ఉంటాడు. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో, చేష్టలతో అక్తర్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అదే తరహాలో షోయబ్ అక్తర్ పేరు ట్రెండింగ్ లో ఉంది. 48 ఏళ్ల వయసులో ఈ మాజీ స్టార్ క్రికెటర్ తండ్రి కావడం హాట్ టాపిక్ గా మారింది.
షోయబ్ అక్తర్ భార్య రువానా ఖాన్ ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో, అక్తర్ మూడోసారి తండ్రి అయ్యాడు. ఈ క్రమంలోనే అక్తర్ ఎమోషనల్ గా ఓ ట్వీట్ చేశాడు. మైకేల్, ముదద్దీద్ లకు సోదరి వచ్చిందని, అల్లాహ్ తమకు ఆడబిడ్డను ప్రసాదించాడని ట్వీట్ చేశాడు. ఇక, తన బిడ్డకు నూరే అలీ అక్తర్ అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. ఏదేమైనా 48 ఏళ్ల లేటు వయసులో కూడా తండ్రి అయిన షోయబ్ కు మాజీ క్రికెటర్లు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో అక్తర్ కు నెటిజనులు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.