.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

ఆ ఇద్దరు టీమిండియా దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచ కప్ మ్యాచ్?

వెస్టిండీస్ నుంచి వయా పాకిస్థాన్, శ్రీలంక వరకు ప్రపంచ కప్ ఫైనల్స్ లలో భారత్ కు ప్రత్యర్థులుగా నిలిచాయి.

Update: 2024-06-29 11:18 GMT

వరుసగా రెండు ప్రపంచ కప్ (వన్డే, టి20)లలో ఫైనల్స్.. అంతకుముందు టెస్టు చాంపియన్ షిప్ లోనూ ఫైనల్స్.. సమకాలీన క్రికెట్ లో మరే జట్టుకూ సాధ్యం కాని రికార్డు.. మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడైన జట్టు అనే రికార్డు ఇది.. దీనిని సొంతం చేసుకున్నది మరే జట్టో కాదు.. టీమిండియానే. ప్రపంచ క్రికెట్ లో టెస్టులు, వన్డేలు, టి20ల్లోనూ టాప్ ర్యాంక్ పొందిన జట్టు భారత్ ఒక్కటేనేమో? కాగా, ఇప్పడు టీమిండియా కీలక పరీక్ష ఎదుర్కోనుంది. మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికాను టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఢీకొట్టనుంది.

ఎన్నడూ చూడని ప్రత్యర్థి

వెస్టిండీస్ నుంచి వయా పాకిస్థాన్, శ్రీలంక వరకు ప్రపంచ కప్ ఫైనల్స్ లలో భారత్ కు ప్రత్యర్థులుగా నిలిచాయి. కానీ, దక్షిణాఫ్రికా మాత్రం ఓ ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ తో తలపడడం ఇదే ప్రథమం. అందుకనే ఈ ఫైనల్ మిగతావాటికంటే భిన్నమైదని అని చెప్పాలి.

వారిద్దరికీ చివరి మ్యాచ్.. టి20ల్లో

టీమిండియాకు దశాబ్దన్నర కాలంగా బ్యాటింగ్ మూలస్తంభాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో వీరిద్దరూ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. అంతేకాదు.. వీరికి టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టి20ల్లో చివరిది కానుంది. 37ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల విరాట్ ను ఇప్పటికే ఓసారి పొట్టి ఫార్మాట్ నుంచి దాదాపు పక్కనపెట్టారు సెలక్టర్లు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. మళ్లీ ఇంతలోనే రోహిత్, కోహ్లిలను వెనక్కు తీసుకొచ్చారు. దీనివెనుక వారి ఉద్దేశం ఏమిటో కానీ.. ఆ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లు కాబట్టి ఎవరూ ఏమీ అనలేదు. అయితే, ఇకమీదట మాత్రం రోహిత్, కోహ్లిలను టీమిండియా తరఫున టి20ల్లోనూ చూడలేం అని విశ్లేషకులు అంటున్నారు.

Read more!

ఇద్దరూనా? ఒక్కరేనా?

రోహిత్ ప్రస్తుత ప్రపంచ కప్ లో అద్బుతంగా ఆడుతున్నాడు. సూపర్ 8 చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చితక్కొట్టాడు. సెమీస్ లో ఇంగ్లండ్ పైనా చెలరేగాడు. కానీ, విరాట్ మాత్రం ఈ కప్ లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ టి20ల్లో కొనసాగుతాడనే వాదన వినిపిస్తోంది. అయితే, దీనికి పెద్దగా అవకాశం కనిపించడం లేదు. ఈ ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు బైబై చెప్పి, వన్డేలు,టెస్టుల్లో మరికొన్నేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News