ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లివే
ఓవరాల్ గా అన్ని ఓటీటీ ఛానల్స్ లో అందుబాటులోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటే ఇలా ఉన్నాయి.
ఓ వైపు థియేటర్స్ లో సినిమా సందడి, మరో వైపు ఓటీటీలో మూవీస్, వెబ్ సిరీస్ లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి దొరుకుతుంది. థియేటర్స్ లో కల్కి 2898ఏడీ మూవీని ఇన్ని రోజులు ఆస్వాదించారు. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనే మాట వినిపిస్తోంది. ఇక ఓటీటీకి వచ్చేసరికి సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ దొరుకుతోంది.
ఒకప్పుడు కంటెంట్ కేవలం ప్రాంతీయ భాషలకి మాత్రమే పరిమితం అయ్యింది. అయితే ఓటీటీల కారణంగా మల్టీ లింగ్వల్ సినిమాలు, ప్రాజెక్ట్స్ సందడి ఎక్కువైంది. వేరొక భాషలో తీసిన సినిమాని ఎక్కువ ప్రేక్షకులు ఉన్న ఇండియన్ భాషలలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీని వలన ఆ సినిమాలకి ప్రేక్షకాదరణ పెడుతోంది. అలాగే వెబ్ సిరీస్ లని కూడా తెరకెక్కించినపుడే 4-5 భాషలలో సిద్ధం చేస్తున్నారు.
ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాల సంగతి చూసుకుంటే ఫాహద్ ఫాజిల్ ధూమం తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోం హర మూవీ కూడా ఆహాలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో విజయ్ సేతుపతి మహారాజ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ మూవీ కావడంతో థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసే అవకాశం ఉంది.
అలాగే డిస్నీ హాట్ స్టార్ లో అగ్ని సాక్షి సిరీస్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. టెలివిజన్ పై హిట్ అయిన సీరియల్ కి సీక్వెల్ గా అగ్నిసాక్షి వెబ్ సిరీస్ ఫార్మాట్ లో వస్తోంది. మరి ఇది ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది చూడాలి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో ఎలక్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓవరాల్ గా అన్ని ఓటీటీ ఛానల్స్ లో అందుబాటులోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటే ఇలా ఉన్నాయి.
ఆహా
ధూమం - స్ట్రీమింగ్ అవుతుంది
హరోం హర - స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
మహారాజా - జూలై 12 నుండి స్ట్రీమింగ్
రిసీవర్(హాలీవుడ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది
వైకింగ్స్ : వాల్ హల్లా 3 (వెబ్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతుంది
వైల్డ్ వైల్డ్ పంజాబ్ హిందీ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
36 డేస్ (హిందీ సిరీస్) - జూలై 12 నుండి స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
అగ్నిసాక్షి తెలుగు సిరీస్ - జూలై 12 నుండి స్ట్రీమింగ్
కమాండర్ కరణ్ సక్సేనా హిందీ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతుంది
మాస్టర్ మైండ్ సిరీస్ - స్ట్రీమింగ్ అవుతుంది
షో టైం వెబ్ సిరీస్ - జూలై 12 నుండి స్ట్రీమింగ్
జియో సినిమా
పిల్ హిందీ మూవీ - జూలై 12 నుండి స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎలక్షన్ - స్ట్రీమింగ్ అవుతుంది