ఓటీటీ: ఈ వారం లైనప్ ఎలా ఉందంటే..
ఇదిలా ఉంటే వివిధ భాషలలలో మేకర్స్ నుంచి వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలలో ప్రతివారం విడుదల అవుతున్నాయి.
డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. భాషపరిమితి లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకొని ఓటీటీలలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లు, సినిమాలు చూడటం ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. ఎంగేజ్ చేసే కంటెంట్ ఏ భాషలో ఉన్న వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కథలని సినిమాలు, సీరియల్స్ ల ద్వారా మాత్రమే అది రీజనల్ భాషలలోనే చూసేవారు.
అందుకే ఏవి రీమేక్ కథలు, ఏవి ఒరిజినల్ స్టోరీస్ అనేది కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మేగ్జిమమ్ ఎవరు రీమేక్ ల జోలికి వెళ్లడం లేదు. ఆడియన్స్ డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడటంతో ఈజీగా రీమేక్, ఒరిజినల్ అనేది గుర్తించేస్తున్నారు. వాటిని పర్టిక్యులర్ గా పోలిక పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. మక్కీకి మక్కీ దించేసి పరిస్థితి ఇప్పుడు లేదు. మేకర్స్ అందరూ క్రియేటివిటీకి పదును పెట్టాల్సిందే.
ఇదిలా ఉంటే వివిధ భాషలలలో మేకర్స్ నుంచి వస్తోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలలో ప్రతివారం విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న సినిమాలు, సిరీస్ ల సంగతి ఓ సారి చూసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ట్ లో ‘హరికథ’ అనే తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనిని నిర్మించింది. అలాగే ‘డ్రీమ్ ప్రొడక్షన్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ డిసెంబర్ 11న రిలీజ్ అయ్యింది. ‘ఎల్టన్ జాన్’ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ 13న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో రోహిత్ శెట్టి తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘సింగం ఎగైన్’ డిసెంబర్ 12న పెయిడ్ అప్షన్ లో రిలీజ్ అయ్యింది. అలాగే హిందీ సిరీస్ బండిష్ బండిట్స్ సీజన్ 2 డిసెంబర్ 13న అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో చియాన్ విక్రమ్ పా రంజిత్ మూవీ ‘తంగలాన్’ డిసెంబర్ 10న రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అలాగే సోనీ లివ్ ఓటీటీలో ‘బొగెన్ విల్లా’ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ డిసెంబర్ 13న రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఇవి కాకుండా ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషలలో మరిన్ని సిరీస్ లు, సినిమాలు సందడి చేస్తున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
డ్రీమ్ ప్రొడక్షన్స్ : (వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
హరికథ : (తెలుగు వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
ఎల్టన్ జాన్ : (హాలీవుడ్ మూవీ)- డిసెంబర్ 13
ఇన్విజబుల్ : (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ
సీక్రెట్ లెవల్ : (హాలీవుడ్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
సింగం ఎగైన్ : (హిందీ మూవీ)- డిసెంబర్ 12
బండిష్ బండిట్స్ సీజన్ 2 : (హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 : ( హాలీవుడ్ సిరీస్)- డిసెంబర్ 9
ది షేప్స్ ఆఫ్ లవ్ : (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 9
తంగలాన్ : (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- డిసెంబర్ 10
జెమియా ఫాక్స్ : (హాలీవుడ్ మూవీ)- డిసెంబర్ 10
పోలో : (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
రగ్డ్ రగ్బీ : (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 10
మకల్యాస్ వాయిస్ : ( హాలీవుడ్ మూవీ)- డిసెంబర్ 11
మారియా : (హాలీవుడ్ సినిమా)- డిసెంబర్ 11
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ : (స్పానిష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
క్వీర్: ఐ సీజన్ 9 : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది ఆడిటర్స్ : (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది కింగ్స్ ఆఫ్ టుపేలో : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ : (థాయ్ మూవీ)- డిసెంబర్ 12
లా పల్మా : (నార్వేజియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
నో గుడ్ డీడ్ : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
1992 : (స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 12
క్యారీ ఆన్ : (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 13
డిజాస్టర్ హాలీడే : (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 13
మిస్ మ్యాచ్‌డ్ సీజన్ 3 : (హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
టాలెంట్ లెస్ టకానో : (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 14
జియో సినిమా ఓటీటీ
బూకీ సీజన్ 2 : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
పారిస్ అండ్ నికోల్ : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
బుక్ మై షో ఓటీటీ
డ్యాన్సింగ్ విలేజ్: ది కర్స్ బిగిన్స్ (ఇండోనేషియన్ మూవీ)- డిసెంబర్ 10
ది క్రో (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 10
సోనీ లివ్ ఓటీటీ
బొగెన్ విల్లా : (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిసెంబర్ 13
జీ5 ఓటీటీ
డిస్పాచ్ : (హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 13
షో ట్రైల్ సీజన్ 2 : ( వెబ్ సిరీస్)- డిసెంబర్ 13
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
వండర్ పెట్స్ : ( వెబ్ సిరీస్) - డిసెంబర్ 13