నెట్ ఫ్లిక్స్ కి బూస్ట్ ఇచ్చిన తెలుగు సినిమాలు

అయితే ప్రేక్షకుల మొదటి ప్రయారిటీ ఎప్పటికి కూడా మాతృభాష సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఉంటుంది.

Update: 2024-12-09 04:12 GMT

ఓటీటీ ఛానల్స్ మధ్య కంటెంట్ ఫైట్ ఎప్పుడూ ఉంటుంది. సబ్ స్క్రైబర్స్ పెరగాలన్న, వ్యూవర్ షిప్ అధికంగా రావాలన్న మంచి కథలని పిక్ చేసుకొని ప్రేక్షకులకి అందించాలి. ఒకప్పుడు భాషాపరిమితి ఉండేది. అయితే ఓటీటీ ఛానల్స్ వచ్చాక ఈ భాషాపరిమితి పూర్తిగా పోయింది. కంటెంట్ బాగుంది అనే టాక్ వస్తే ఆడియన్స్ ఆ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రీజనల్ కథల నుంచి ఇంటర్నేషనల్ స్టోరీస్ వరకు ప్రతివాటిని చూసేందుకు ముందుకొస్తున్నారు.

అయితే ప్రేక్షకుల మొదటి ప్రయారిటీ ఎప్పటికి కూడా మాతృభాష సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఉంటుంది. ముఖ్యంగా సౌత్ లో రీజనల్ లాంగ్వేజ్ కంటెంట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సౌత్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లు ఆరంభంలో టాప్ లో ఉండేవి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఛానల్ లో ఎక్కువగా హాలీవుడ్, ఇంటర్నేషనల్ కంటెంట్ మాత్రమే ఉండేది. వారి సబ్ స్క్రిప్షన్ చార్జీలు కూడా ఎక్కువగా ఉండటంతో ఇండియన్ ఆడియన్స్ ఆరంభంలో నెట్ ఫ్లిక్స్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఇండియాలో సబ్ స్క్రైబర్స్ ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ కొనుగోలు చేయాలని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం డిసైడ్ అయ్యింది. ప్రత్యేకంగా సౌత్ సినిమాలపై ఫోకస్ చేసింది. దీనికి కారణం సౌత్ ఇండియా సినిమాలకి దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరగడమే. భారీ ధరలు పెట్టి సౌత్ సినిమాల రైట్స్ కొనడం స్టార్ట్ చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. వీటికి ఓటీటీలో మంచి ఆదరణ వస్తున్నాయి.

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఓటీటీలో ఇప్పటికి ట్రెండింగ్ లో టాప్ 3 మూవీగా ఉంది. అలాగే ఈ ఏడాది రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ సినిమాకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నాని ‘సరిపోదా శనివారం’ మూవీకి సాలిడ్ గా వ్యూవర్ షిప్ రావడం విశేషం. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ట్రెండింగ్ లో నడుస్తోంది. గత ఏడాది రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకున్న ‘హాయ్ నాన్న’, ‘టిల్లు స్క్వేర్’, ‘సలార్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’, ‘మ్యాడ్’ సినిమాలకి నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూవర్ షిప్ వచ్చింది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మిస్టర్ బచ్చన్’, ‘మత్తు వదలరా 2’ లాంటి సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్ ని అమాంతం పెంచేశాయి. ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ రేసులో నెట్ ఫ్లిక్స్ టాప్ లో ఉండటానికి తెలుగు సినిమాలు ఒక బలమైన కారణం అని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా ఓటీటీలో మంచి ఆదరణ అందుకునే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News