కేసీఆర్ స్మార్ట్ వర్క్

కేసీయార్ చేస్తున్న పనేమిటంటే మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో మాట్లాడుతు అభిప్రాయాలను సేకరిస్తున్నారట.

Update: 2023-07-20 06:24 GMT

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో కేసీయార్ సైలెంటుగా పని చేసుకుంటున్నారట. కేసీయార్ చేస్తున్న పనేమిటంటే మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో మాట్లాడుతు అభిప్రాయాలను సేకరిస్తున్నారట. జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించటం వల్ల నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల పరిస్ధితి, ఆశావహుల స్ధితిగతులపై వివరాలను తెలుసుకుంటున్నట్లు పార్టవార్గాల టాక్.

పనిలోపనిగా సిట్టింగ్ ఎంఎల్ఏలతో పాటు ప్రతిపక్షాల ఎంఎల్ఏలు, ఆస్పిరెంట్లపై అవసరమైన వివరాలను తెలుసుకుంటున్నారు. దీనివల్ల గ్రౌండ్ లెవల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్లాన్ చేశారట.

మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సంబంధం లేని వ్యక్తులు లేదా సంస్ధలతో సర్వేలు జరిపించుకోవడం ఒక పద్ధతి. దీని వల్ల ఏమవుతుందుంటే నియోజకవర్గానికి లేదా ఎంఎల్ఏ లేదా ఆశావహులతో ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి వివరాలు వీలైనంత వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే అనుకోవాలి. అయితే ఇంతకన్నా యాక్యురేట్ గా వివరాలు రావాలంటే ఏమిచేయాలి ?

ఏమి చేయాలంటే సిట్టింగులు లేదా ఆశావహుల ప్రత్యర్ధులను కదిలిస్తే మొత్తం వివరాలను బయటకు చెప్పేస్తారు. పార్టీలోని ప్రత్యర్థులు ఎప్పుడు ఒకళ్ళ వివరాలను మరొకళ్ళు ఎప్పుడు తెలుసుకుంటునే ఉంటారు.

ఇలాంటి నేతల వల్ల తమ ప్రత్యర్ధుల పూర్తి వివరాలు పార్టీల అధినేతలకు అందించటం ఖాయం. ఇపుడు కేసీయార్ చేస్తున్నదిదే. ఒకవైపు తన పద్దతుల్లో సర్వేలు చేయించుకుంటునే పనిలోపనిగా పార్టీ నేతల ద్వారా కూడా డైరెక్టుగా మాట్లాడటం ద్వారా వాళ్ళ ప్రత్యర్ధుల వివరాలను సేకరిస్తున్నారు.

తమ పార్టీలోని నేతల ద్వారా తీసుకుంటున్న వివరాలకు అదనంగా ప్రత్యర్ధి పార్టీలకు చెందిన సిట్టింగులు, నేతల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సాధ్యమైనవంతవరకు క్షేత్రస్ధాయి వివరాలు కేసీయార్ సంపాదించగలుగుతున్నారు.

మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలకు సంబందించిన పూర్తి వివరాలు సంపాదించుకున్న తర్వాత వాళ్ళపై ఒక్కసారిగా ఎటాక్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. షెడ్యూల్ ప్రకారమైతే ఎన్నికలకు ఉన్నది నాలుగు నెలలు మాత్రమే.

అందుకనే వీలైనన్ని మార్గాల్లో ఎంత వీలైతే అంత వివరాలను సంపాదించాలని టార్గెట్ పెట్టుకుని సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారట. మరీ వివరాలను ఎలా ఉపయోగించుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News