అడ్డంగా దొరికిపొయిన కేసీయార్
మరి లెక్కలు ఇంత స్పష్టంగా ఉంటే కేసీయార్ మాత్రం కాళేశ్వరం కోసం చేసిన అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఎలా చెప్పారో అర్ధంకావటంలేదు
ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుందని పాలకులు అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఇపుడు అలా మాట్లాడే కేసీయార్ తగులుకున్నారు. సచివాలయంలో ఇరిగేషన్ మీద జరిగిన సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టుకోసం చేసిన అప్పు ఎప్పుడో తీరిపోయిందన్నారు. కాళేశ్వరం అప్పు తీరిపోయిందని కేసీయార్ ఇలా అన్నారో లేదో వెంటనే ప్రతిపక్షాలు, అప్పులిచ్చిన కొర్పొరేషన్లు, బ్యాంకులు మండిపోతున్నాయి. కేసీయార్ అబద్ధాలు చెప్పారని వాయించేస్తున్నాయి. మరి కేసీయార్ ఎందుకింత అబద్ధాలు చెప్పినట్లు ? అబద్ధాలు చెప్పటం కేసీయార్ కు అలవాటేనని ప్రతిపక్షాలు మండిపోతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు లక్ష కోట్లరూపాయలు అప్పులు చేసింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నబార్డ్, బ్యాంకుల కన్సార్షియం నుండి అప్పులు తెచ్చింది. 2035కి తీసుకున్న అప్పు మొత్తం ప్రభుత్వం తీర్చాల్సుంటుంది.
అసలు+వడ్డీ కలిపి ప్రభుత్వం ఏడాదికి రు. 13 వేల కోట్లు. అయితే ఇప్పటివరకు చెల్లించిన అసలు రు. 545 కోట్లు, కట్టిన వడ్డీ రు. 6400 కోట్లు. మొత్తంమీద ప్రభుత్వం చెల్లించింది సుమారు రు. 7 వేలకోట్లు మాత్రమే. అంటే ఏడాదికి చెల్లించాల్సిన దాంట్లో సగం మాత్రమే చెల్లించింది.
మరి లెక్కలు ఇంత స్పష్టంగా ఉంటే కేసీయార్ మాత్రం కాళేశ్వరం కోసం చేసిన అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఎలా చెప్పారో అర్ధంకావటంలేదు. తనను తాను గొప్పగా చిత్రీకరించుకోవటంతో పాటు రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అయ్యిందని చెప్పుకోవటమే కేసీయార్ ఉద్దేశ్యం. ఆ ప్రయత్నంలో నోటికేదొస్తే అది చెప్పేస్తుంటారు. ఇపుడు కాళేశ్వరం అప్పు విషయంలోనే కేసీయార్ గాలిని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గాలి తీసేసింది.
ఎచ్చులకు పోయి అబద్ధాలు చెప్పటం ఎందుకు తర్వాత తీరిగ్గా తలంటి పోయించుకోవటం ఎందుకు ? కాళేశ్వరంపై మొదటినుండి ప్రతిపక్షాలు మండిపడుతునే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఆదాయం రావటంలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా స్పష్టంగా చెప్పింది.
భారీఎత్తున అప్పులు చేసిన ప్రభుత్వం ఎలా తీరుస్తుందని కాగ్ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు వల్ల కోట్లాది టన్నుల వరి పండుతోందని కేసీయార్ పదేపదే చెప్పుకుంటుంటారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల అదనంగా ఒక్క ఎకరా ఆయకట్ట కూడా పెరగలేదని ప్రతిపక్షాలంటున్నాయి.