ఒక రాజు.. వంద మంది భార్యలు అన్న వెంటనే ఏదేదో ఊహించుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రాజుగారి వంద మంది భార్యల విషయంలో ఇక్కడ లెక్క కాస్త వేరుగా ఉంటుంది మరి. ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు.. కొన్ని దేశాల్లో నియంతృత్వంలో సాగుతున్నా.. కొన్ని దేశాల్లో ఇప్పటికి రాజరిక వ్యవస్థ నడుస్తోంది.
కేమరూన్ రాజు అబుంబి వ్యవహారం కాస్త డిఫరెంట్. ఈ రాజుకు వంద మంది భార్యలున్నారు. అంతేకాదు.. ఈ దేశానికి రాజు అయ్యే ప్రతి ఒక్కరాజుకు వంద మంది భార్యలు ఉంటారు. ఎందుకంటే.. ఇక్కడి సంప్రదాయం అదే మరి. గందరగోళం ఉందా? వివరంగా ఈ ఆసక్తికర ఉదంతాన్ని చెప్పాల్సి వస్తే..
కేమరూన్ దేశంలో రాచరిక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ రాజు అయ్యే వ్యక్తికి.. సంప్రదాయ బద్ధంగా వంద మంది రాణులు భార్యలు అవుతారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాజు.. తన సంప్రదాయం ప్రకారం వచ్చే వంద మంది భార్యల నుంచి రాజ్యాన్ని ఎలా నడపాలి? మంచి చెడ్డలు ఎలా చూడాలి? లాంటి విషయాలు నేర్పుతారు. కొత్త రాజు కారణంగా పాలనలో ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాట్లు జరిగాయని చెబుతారు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటటే.. అప్పటివరకూ యువరాజుగా ఉన్న వ్యక్తి రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు ఎంతమంది కావాలంటే అంతమందిని వివాహంగా చేసుకొని భార్యలుగా చేసుకోవచ్చు. అయితే.. అలా పెళ్లి చేసుకొన్న వారంతా అప్పటికే రాణి హోదాల్లో ఉన్న పెద్దవారి మాట జవదాటకూడదు. పెద్ద రాణులు చెప్పిన సంప్రదాయాల్ని పాటిస్తూ యువరాణులు అనుసరించాలి. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ భార్యల వ్యవహారం ఇప్పడిప్పుడే కొత్త చర్చ కు దారి తీస్తోంది. ఇప్పటి రోజుల్లో కూడా ఇంత మంది భార్యలు అవసరమా అన్న చర్చ మొదలైంది. బాగుంది కదూ..ఒక రాజు.. వందమంది రాణుల స్టోరీ.