పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 27 మంది మృతి చెందటం తెలిసిందే. ఈ తొక్కిసలాటకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేయటం తెలిసిందే. మనుషులుచేసిన తప్పులతో తొక్కిసలాటలు చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లటం మామూలే.
కానీ.. ఒక ఎలుక కారణంగా ఏర్పడిన తొక్కిసలాటకు భారీగా గాయాల పాలు కావటం సాధ్యమేనా? అంటే అవుననే చెప్పకతప్పదు. తాజాగా మెరాకో దేశంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆశ్చర్యంగానూ.. అయ్యో అనిపించేలా ఉంది.
రంజాన్ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఒక మసీదులో స్థానిక మహిళలంతా కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారి అలజడి. ఒక ఎలుక మసీదులో కనిపించటం.. దాన్ని చూసిన ఒకమహిళ పెద్దగా అరవటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో..ఏదో జరిగిపోయిందన్న ఉద్దేశ్యంలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా పరుగులు పెట్టటం మొదలు పెట్టారు. దీంతో.. ఒకరి మీద ఒకరు పడుతూ.. తొక్కేస్తూ అక్కడ పరిస్థితి కాసేపటికే అదుపు తప్పింది.
ఈ ఉదంతంలో మొత్తం ఏనభై మంది వరకు గాయాలయ్యాయి. ఈ తొక్కిసలాట కారణంగా కొందరు మహిళలకు ఎముకలు విరిగి ఫ్యాక్చర్ అయితే.. ఒక గర్భిణి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెబుతున్నారు. ఒక ఎలుక ఎంత రచ్చ చేసిందో కదా. విషయం చిన్నదైనా.. ఆ చుట్టూ ఉండే వారి రియాక్షన్ అనుసరించి.. పరిస్థితి ఎంత భయానకంగా మారుతుందనటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.