అప్పుడెప్పుడో వచ్చిన కిక్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరో.. కిక్ కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తుంటాడు. ఏ ఉద్యోగానికైనా మేడ్ ఫర్ అన్నట్లుగా ఉండే ఆ హీరో.. తనకు కిక్ కానీ పోతే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మానేయటం.. బాస్ ఎంత కోరినా నో చెప్పేయటం తెలిసిందే. ఇలాంటి వారు రియల్ గా ఉంటారంటే కాస్త డౌటే. అయితే.. అలాంటి వారు ఉంటారని.. కిక్ కోసం కాకున్నా.. రికార్డు కోసం ఇలాంటి చిత్రమైన పని చేసిన వ్యక్తి ఉదంతం తాజాగా బయటకు వచ్చింది.
52 వారాల్లో 52 ఉద్యోగాలు చేసిన కెనడాకు చెందిన సీన్ అయికిన్ ను స్ఫూర్తిగా తీసుకున్న జుబనాష్వ మిశ్రా అనే యువకుడు పెద్ద సాహసాన్నే చేస్తున్నాడు. భువనేశ్వర్ లో బీటెక్ చేసిన ఇతగాడు.. అహ్మదాబాద్ ఎంఐసీఏ నుంచి పీజీ పూర్తి చేశారు. ఇప్పటికి ఇతగాడు 28 వారాల్లో 28 రాష్ట్రాల్లో 28 ఉద్యోగాలు పూర్తి చేశాడు.
హర్యానాలో ఫోటోగ్రాఫర్ గా.. హిమాచల్ ప్రదేశ్ లో చెత్త ఏరేవాడిగా..ఏపీలో ప్లే స్కూల్ టీచర్ గా.. జమ్మూలో గైడ్ గా.. ఒడిశాలో టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ విశ్లేషకుడిగా.. కర్ణాటకలో కన్సల్టెంట్ గా.. గోవాలో టాటూలు వేసి.. తమిళనాడులో వేరుశనగలు అమ్మే వ్యక్తిగా తిరిగి ఇతగాడు.. చివరకు శ్మశానంలో సహాయకుడిగా పని చేయటానికి వెనుకాడలేదంట.
కలలు కనాలని.. వాటిని నిజం చేసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడకూడదని అతగాడు చెబుతున్నాడు. ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పే ఇతగాడు యువత ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉండాలన్న ప్రచారం కోసమే తానీ పని చేస్తున్నట్లు చెప్పాడు. సినిమాల్లోనే కాదు.. కొన్ని పాత్రలు మన చుట్టూ కూడా ఉంటాయన్నది మిశ్రాను చూస్తే అర్థమవుతుంది.