రెండు రోజుల్లో కల్కి కలెక్షన్స్ ఎంతంటే?
మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ భారీగానే తగ్గాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కల్కి సాధించింది.
కల్కి2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. అయితే మైథాలజీ ఎడాప్షన్ లో క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసే విధానంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని హిందుత్వ వర్గాల నుంచి వినిపిస్తోన్న ఆరోపణ. ముఖ్యంగా కర్ణుడిని పాజిటివ్ గా చిత్రీకరించడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పబ్లిక్ మాత్రం ఈ అభ్యంతరాలని పెద్దగా పట్టించుకోవడం లేదు.
మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 190 కోట్ల కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ మూవీ వసూళ్లు చేసింది. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని కల్కి సాధించింది. దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే రెండో కూడా కూడా కల్కి కలెక్షన్స్ 100+ కోట్లు దాటాయి. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ భారీగానే తగ్గాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కల్కి సాధించింది.
శని, ఆదివారాలు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. వీకెండ్ పూర్తయ్యేసరికి 500 నుంచి 600 కోట్ల వరకు కల్కి మూవీ కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడగలిగే విధంగా మూవీ ఉందనే టాక్ రావడంతో రోజురోజుకి ప్రేక్షకాదరణ పెరుగుతోంది. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న థియేటర్స్ కి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
రెండు వరాల పాటు కలెక్షన్స్ స్థిరంగా కొనసాగితే 1000 నుంచి 1500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని కల్కి మూవీ సాధించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన. అలాగే నాగ్ అశ్విన్ ఇమాజినేషన్, మేకింగ్ కి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.
దీపికాపదుకునే సుమతి పాత్రలో కనిపించింది. కలిపురుషుడైన సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించారు. మూవీ హిట్ టాక్ దిశగా దూసుకుపోవడంతో ఫ్యాన్స్ కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందంట.