ఆమెకు ముగ్గురు భర్తలు... ఎవరో హత్య చేశారు!

ఆమెకు ముగ్గురు భర్తలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారట

Update: 2023-07-20 09:44 GMT

బుధవారం రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగానే, సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉండగానే, ఒక మహిళను దారుణంగా చంపేశారు. ఈ దారుణ సంఘటన చెన్నైలోని సైతపెట్టై రైల్వే స్టేషన్‌ లో జరిగింది!

అవును... రైల్వేస్టేషన్ లోనే ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. చెన్నైలోని మీనంబాక్కం ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన రాజీ అలియాస్ రాజేశ్వరి (34) అనే మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులు.. అనంతరం అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... రాజేశ్వరి అనే మహిళ రైలులో సమోసాలు, పండ్లు అమ్ముతుంటుందంట. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కూడా ఎగ్మూరు నుంచి గిండీ వెళ్తున్న రైలులో రాజేశ్వరి పండ్లు, సమోసాలు విక్రయిస్తోందట. అనంతరం పక్కనే ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చి ఆగిందంట. ఈ సమయంలో ఫ్లాట్ ఫాం పైకి వచ్చిందంట రాజేశ్వరి.

దీంతో ఆగిఉన్న ఎలక్ట్రిక్ ట్రైన్ నుంచి దూకిన నలుగురు దుండగులు ఆమెపై కత్తులతో దాడిచేశారని తెలుస్తుంది. కత్తులూ కొడవళ్లతో ఆమెను దారుణంగా నరికి అక్కడనుంచి పారిపోయారంట. దీంతో రక్తపుమడుగులో ఉన్న రాజేశ్వరిని రైల్వే పోలీసులు సైదాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారట.

అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతున్న రాజేశ్వరి గురువారం తెల్లవారు జామున మృతి చెందిందని తెలుస్తుంది. హత్యపై మాంగంబాక్కం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు.

రాజేశ్వరికి ఇప్పటికే ముగ్గురితో పెళ్లి జరిగింది అని, ఆమెకు ముగ్గురు భర్తలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారట. అయితే ఈమధ్య కాలంలో ఆమె మూడో భర్త హత్యకు గురవ్వగా... ప్రస్తుతం రెండో భర్త వద్ద ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందట. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమా అనే కోణంలో విచారణ జరుగుతుందని తెలుస్తుంది!

Tags:    

Similar News