లిప్ కిస్సుల్లో అదో ప్లాప్ రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలం!

అందులోనూ బాలీవుడ్ లో ఎంతో స్వేచ్ఛ‌గా సినిమాలు తీసే అవ‌కాశం ఉంది. లిప్ లాక్..ఇంటిమేట్ స‌న్నివేశాల విష‌యంలో ఏ ద‌ర్శ‌కుడు వెన‌క్కి త‌గ్గ‌డు.

Update: 2024-10-11 00:30 GMT

సినిమాలో కంటెంట్ ని బ‌ట్టి స‌న్నివేశాలుంటాయి. హీరో-హీరోయిన్లు తెర‌పై ఎలా క‌నిపించాలి? అన్న‌ది ద‌ర్శ‌కుడి విజ‌న్ మేర‌కు వాళ్లంతా ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఏ ద‌ర్శ‌కుడు రాజీ ప‌డ‌రు. అందులోనూ బాలీవుడ్ లో ఎంతో స్వేచ్ఛ‌గా సినిమాలు తీసే అవ‌కాశం ఉంది. లిప్ లాక్..ఇంటిమేట్ స‌న్నివేశాల విష‌యంలో ఏ ద‌ర్శ‌కుడు వెన‌క్కి త‌గ్గ‌డు.

తాజాగా ఓబాలీవుడ్ సినిమాలో 30 లిప్ లాక్ స‌న్నివేశాల రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉందంటే? న‌మ్ముతారా? అవును. ఇది నిజ‌మే. ఇంత‌వ‌ర‌కూ ఆసినిమా రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయ‌లేదు. ద‌రిదాపుల్లోకి కొన్ని సినిమాలు వెళ్లాయి గానీ...30 కిస్సులు ఏ సినిమాలోనూ లేవు. బాలీవుడ్ లో నే సాధ్యం కాలేదు అంటే సౌత్ లో అంత‌టి ధైర్యం ఎవ‌రూ చేయ‌గ‌ల‌రు. ఇంత‌కీ ఏంటా సినిమా అంటే? అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

అదే 2013లో రిలీజ్ అయిని `3జీ`. శంతను రే ఛిబ్బర్, శీర్షక్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర‌మిది. `సాహో` ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఇందులో 20..కాదు 25 కాదు ఏకంగా 30 కిస్సింగ్ స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ రికార్డు ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. ఇన్ని కిస్సులు న్నా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయింది. ఏమాత్రం ఆశాజ‌న‌కంగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు.

కిస్సుల్లో అంత‌కు ముందు ‘మర్డర్‌’ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది 3జీ. ఈ సినిమాకు రాటెన్ టొమాటోస్‌ కేవలం 12% రేటింగ్‌ మాత్రమే ఇచ్చింది. దీంతో అతి తక్కువ రేటింగ్ పొందిన భారత సినిమాల్లో 3జీ మూవీ నిలిచింది. ప్ర‌ఖ్యాత ఐఎండీబీ కూడా కేవలం 3.6 రేటింగ్ మాత్ర‌మే ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 5.9 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇది ఈ మొత్తం పెట్టిన ఖ‌ర్చు కంటే చాలా త‌క్కువ‌. ఇక అదే ఏడాది రిలీజ్ అయిన `శుద్ధ్ దేశీ రొమాన్స్‌`లో 27 కిస్‌లు ఉన్నాయి. ఆ త‌ర్వాత `బేఫిక్రే`లో 25 ముద్దులు ఉన్నాయి.

Tags:    

Similar News