ఆ డైరెక్టర్ కోసం నలుగురు లేడీ డైరెక్టర్లు!
ఈ సినిమాని తెరకెక్కించే బాద్యతలు నలుగురు లేడీస్ కి అప్పగించారు. వారే అభీషా..స్నేహ..బెల్సిన్.. కనీష్కా సీఈ.. శివరంజిని ఈ నులుగురు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఒక సినిమాకి ఒకరుకు మించి ఇద్దరు దర్శకులు పనిచేయడం అన్నది చూసాం. బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే ద్వయం ఏ సినిమా చేసినా ఇద్దరు దర్శకులుగా పనిచేస్తారు. కథ రచన దగ్గర నుంచి దర్శకత్వం వరకూ ప్రతీ పనిలో భాగమవుతుంటారు. నిర్మాణం కూడా అంతే. వాళ్లిద్దరు ఏ సినిమా చేసినా కలిసే పని చేస్తారు తప్ప! విడివిడిగా చేయరు. ఇంకా అవసరం మేర అనుభవం తక్కువైతే దర్శకత్వ పర్యవేక్షణ అప్పుడప్పుడు చూస్తుంటాం. మెయిన్ గా ఓ దర్శకుడు ఉండి...బ్యాకెండ్ లో మిగతా వారంతా సూచన లు..సలహాలు ఇస్తుంటారు.
కానీ ఒకే సినిమాకు నలుగురు దర్శకులు పనిచేయడం అన్నది ఇంతవరకూ జరగలేదు. అందులోనూ అంతా లేడీస్ కావడం ఇంకా ఆశ్చకరమైన విషయం. అవును ఇది నిజమే. వివరాల్లోకి వెళ్తే యాక్షన్ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న కోలీవుడ్ దర్శకుడు పారంజిత్ సుపరిచితుడే. 'మద్రాస్'..'కాలా'..'కబాలీ' లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన రంజిత్ ఇప్పుడు నిర్మాతగా మారి 'కళ్లీ పాల్ లా ఓరు టీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని తెరకెక్కించే బాద్యతలు నలుగురు లేడీస్ కి అప్పగించారు. వారే అభీషా..స్నేహ..బెల్సిన్.. కనీష్కా సీఈ.. శివరంజిని ఈ నులుగురు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ మహిళ చుట్టూ తిరిగే వైవిథ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇలా నలుగురు లేడీస్ ఎంపిక చేయడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. నలుగుర భిన్న దృక్ఫధం కలవారుట. క్రియేటివ్ పరంగా చాలా ఇన్నో వేటివ్ గా థింక్ చేస్తారుట.
వీళ్లంతా ఒకేతాటిపైకిచ్చి సినిమా చేయడం గొప్ప విషయమని రంజిత్ అంటున్నాడు. నిజమే నలుగురు ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ రాకుండా సినిమా పూర్తిచేయడం అన్నది చిన్న విషయం కాదు. నెలల తరబడి షూటింగ్ చేసే క్రమంలో గానీ...స్టోరీ సిద్దం చేసే ప్రోసస్ లో గానీ క్రియేటివ్ తేడాలొచ్చి ఎగ్జిట్ అవుతుంటారు. కానీ పారంజిత్ ఆ నలుగురి మధ్య ఎలాంటి డిఫరెన్స్ రాకుండా ఇంతవరకూ తీసుకురాగలిగారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది.