లెగ్స్ అందాలతో అషు పాప బ్లాస్టింగ్

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో అషు రెడ్డి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

Update: 2024-09-26 23:30 GMT

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో అషు రెడ్డి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. జూనియర్ సమంతగా క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ తన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా వేదికపై ఎప్పటికప్పుడు ల్ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. షార్ట్ వీడియోలతో ప్రాచుర్యం పొందిన ఆషు, బుల్లితెర రియాలిటీ షోలతో కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.

ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. తొలుత కాస్త బొద్దుగా కనిపించిన అమ్మడు అనంతరం స్లిమ్ లుక్‌లోకి మారి తన గ్లామర్ షోతో అందరి చూపును ఆకర్షిస్తోంది. అర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ తర్వాత ఆమె అందం, గ్లామర్‌కి కొత్త రేంజ్ వచ్చింది. సినిమాల పరంగా చూసినట్లయితే, ఆమె కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ, ప్రధానంగా మోడలింగ్ రంగంలో ముందుకు సాగుతోంది.

సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఆషు రెడ్డి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించిన ఆషు, పొట్టి జీన్స్ లో కుర్రకారుని కట్టిపడేస్తోంది.

ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆషు రెడ్డి లాంటి అందం, గ్లామర్‌ను చూసి చాలామంది గ్లామరస్ బ్యూటీలు కుల్లుకుంటారు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెకు పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. ఇలాంటి గ్లామర్ షోతో ఆషు రాబోయే రోజుల్లో హీరోయిన్‌గా మంచి అవకాశాలను అందుకునే ఛాన్స్ ఉంటుందని ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Tags:    

Similar News