సినిమాలపై ఫ్యాషన్ తో కలెక్టర్ పోస్ట్కి రాజీనామా
అయితే అభిషేక్ సింగ్ ఇప్పుడు సినిమాలపై ప్యాషన్ తో తన ఉద్యోగానికే రాజీనామా చేసారు.
అభిషేక్ సింగ్ కష్టపడి చదివి ఐఏఎస్ సాధించాడు. యూపీ కేడర్ కి చెందిన అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. సర్వీసులో వివాదాలుకు కేరాఫ్ అడ్రస్ గానూ మారారు. సర్వీస్ ట్రాక్ లో ఎన్నో డిప్యూటేషన్స్ ఉన్నాయి. అభిషేక్ సింగ్ భార్య శక్తి నాగ్ పాల్ కూడా కలెక్టర్. నిజాయితీగల అధికారిగా దంపతులు ఇద్దరికీ మంచి పేరుంది. అయితే అభిషేక్ సింగ్ ఇప్పుడు సినిమాలపై ప్యాషన్ తో తన ఉద్యోగానికే రాజీనామా చేసారు.
ఈ విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించి షాక్ అయ్యారు. దీనికి ముందు ఆయన గుజరాత్ ఎన్నికల సమయంలో పరిశీలకుడనని చెప్పుకున్నారు. ఇది ప్రభుత్వం నిబంధనలకు విరుద్దం. దీంతో ఈసీ అతన్ని సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసారు. ఇక అభిషేక్ సింగ్ కి సినిమాలంటే పిచ్చి. 'ఢిల్లీ క్రైమ్' సీజన్ -2లో ఇన్వస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఓటీటీలో మంచి నటుడిగానూ పేరు తెచ్చుకున్నాడు.
అంతకు ముందు ర్యాంప్ ల పై మోడల్ గానూ మెరిసాడు. అభిషేక్ సింగ్ తొలిసారి 'ఛార్ పండ్రా' అనే షార్ట్ పిలిం చేసాడు. దీన్ని టీ-సిరీస్ నిర్మించింది. ఇందులో అతని పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టు కుంది.
అమర ప్రేమికుడిగా ఇందులో మెప్పించాడు. అందులో ఓ పాటని తన నిజ జీవిత అనుభవాలు ఆధారంగా తెరకెక్కించాడు. ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అక్కడే అభిషేక్ సగం సక్సస్ అయ్యాడు.
మంచి పెర్పార్మన్ అనిపించాడు. ఆ తర్వాత ఇతర మాధ్యమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఇక అక్కడి నుంచి బాలీవుడ్ కి రావడమే ఆలస్యం. అవకాశం వస్తే అక్కడా సత్తా చాటే నటుడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకుని హిందీ పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు అందుకుంటాడో చూడాలి.