కొంటె ప్రశ్నకు చిర్రెత్తిపోయిన తమన్నా ప్రియుడు
ఇటీవల ఈ జంట విహార యాత్ర కోసం మాల్దీవులకు వెళ్లారు. తమన్నా అక్కడి నుంచి కొన్ని అందమైన ఫోటోలను కూడా షేర్ చేసింది
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా - విజయ్ వర్మ జంట ప్రేమాయణం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ అందమైన జంట ఇటీవలే అధికారికంగా తాము ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు. వారిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించారు. ఘాటైన శృంగార సన్నివేశాల్లో జీవించి అబ్బురపరిచారు. లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో తమన్నా ఘాటైన లిప్ లాక్ ని వేయడం హాట్ టాపిక్ అయింది. ఆఫ్ ద స్క్రీన్.. ఆన్ ద స్క్రీన్ ఈ జంట చెలరేగిపోవడం యూత్ లో చర్చకు వచ్చింది.
ఇక తమన్నా కోసం విజయ్ .. విజయ్ కోసం తమన్నా అంతకుముందు ఉన్న రూల్స్ ని కూడా బ్రేక్ చేసారు. నో లిప్ లాక్ రూల్ ని తనకు నచ్చినవాడి కోసం తమన్నా బ్రేక్ చేయగా.. తమన్నా కోసం డేటింగ్ రూల్స్ ని కూడా మినహాయించాడు విజయ్ వర్మ. ఏది ఏమైనా ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరుగా జీవిస్తున్నారు. ఒకరికోసం ఒకరు తపిస్తున్నారు. ఇది అందరికీ అర్థమైన వాస్తవం.
ఇటీవల ఈ జంట విహార యాత్ర కోసం మాల్దీవులకు వెళ్లారు. తమన్నా అక్కడి నుంచి కొన్ని అందమైన ఫోటోలను కూడా షేర్ చేసింది. తమన్నా ఈ ఫోటోల్లో ఎంతో అందంగా కనిపించింది. ఇక తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయంలో కనిపించిన తమన్నా- విజయ్ జంటను ఫోటోగ్రాఫర్లు యథావిధిగా ఆటపట్టించే ప్రశ్నలతో అసౌకర్యానికి గురిచేశారు. ఫోటోగ్రాఫర్లలో ఒకరు తమన్నాను ఒంటరిగా చూసి ''విజయ్ సర్ రాలేదా? అని అడిగాడు. దీనికి తమన్నా సమాధానం చెప్పలేదు కానీ బలవంతంగా నవ్వింది. ఆ వెంటే విజయ్ వర్మ ఎయిర్పోర్ట్లో కెమెరాలకు చిక్కాడు. అయితే ఈ జంటను ఆటపట్టించే ప్రశ్నలు పదే పదే రిపీటవ్వడంతో విజయ్ చాలా సీరియస్ అయ్యాడు.
ఇంతకీ ఫోటోగ్రాఫర్ అంతగా విసిగించే ప్రశ్న ఏం అడిగాడు? అంటే.. ''మాల్దీవుల్లో సముద్ర విహారంలో సరదాగా గడిపారా?'' అంటూ చిలిపి ప్రశ్న సంధించాడు ఒక ఫోటోగ్రాఫర్. దానికి విజయ్ సీరియస్ అయ్యాడు. ఇస్ తరహ్ కీ బాత్ నహీ కర్ సక్తే హో (మీరు ఇలా మాట్లాడలేరు!) అని విజయ్ బదులిచ్చారు. తమన్నా- విజయ్ వర్మ మాల్దీవుల వెకేషన్ లో మరో లెవల్లో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేసారనేది ఫోటోగ్రాఫర్ల అభిమతం. అందుకే విజయ్ వర్మను, తమన్నాను వెంబడించి అలా ప్రశ్నించారు. ఈ కామెంట్లను తట్టుకోలేక గుస్సాయించారు ఆ ఇద్దరూ..