లవ్ సింబల్ తో జాన్వీ సయ్యాట..ఎవరి కోసమో!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ సత్తా చాటుతోంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ సత్తా చాటుతోంది. అలాగే ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోనూ జాన్వీ హైట్స్ -ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో కుర్రకారు మతులు చెడగొడుతుంది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో సెగలు పుట్టిస్తుంది. ఎలాంటి డిజైనర్ లోనైనా తనదైన మార్క్ వేస్తుంది. సంథిగ్ స్పెషల్ గా ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
తాజాగా అంతర్జాలాన్ని షేక్ చేసేలా జాన్వీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అమ్మడు గ్రీన్ కలర్ లవ్ సింబల్ టాప్ ధరించింది. టాప్ ని మ్యాచ్ చేస్తే అదే రంగులో ఔట్ ఫిట్ లో కనిపించింది. అమ్మడి రంగుని..రూపాన్ని ఈ గ్రీన్ కలర్ ఔట్ ఫిట్ మరింత అందంగా ఫోకస్ చేస్తుంది. ముఖానికి లైట్ మ్యాకప్..పెదాలకు పూసిన లిప్ స్టిక్..హెయిర్ స్టైల్ అన్నింటా జాన్వీ మార్క్ కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో ఇ న్ స్టాలో వైరల్ గా మారింది. జాన్వీ అభిమానులు అమ్మడి అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు చేస్తున్నారు. బ్యూటీలో మామ్ నే మించిపోతుందా? అంటూ పోస్ట్ లు పెడుతు న్నారు.ఇక జాన్వీ కెరీర్ గురించి చెప్పేదేముంది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ఎన్టీఆర్ తో నటిస్తోన్న `దేవర` తర్వాత జాన్వీ రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుందని అంచనాలున్నాయి.
ఆ ఫలితంతో సంబంధం లేకుండానే కొత్త అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ కి అమ్మడు పర్పెక్ట్ జోడీ అని వాళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తే బాగుంటుందని సాక్షాత్తు చిరంజీవే అన్నారు. అంతకు మించిన మాట జాన్వీకి ఇంకెక్కడ దొరుకుతుంది. అతిలోక సుందరి డాటర్ గా ఆమెని ఎప్పుడూ టాలీవుడ్ గౌరవిస్తుంది. అవకాశాలతోనూ ప్రోత్సహిస్తుంది.