పిక్ టాక్ : దీపావళి పార్టీ లో అందాల చిచ్చుబుడ్

అక్కడ ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా జాన్వీ కపూర్ కి ఇక్కడ శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల మంచి క్రేజ్ ఉంది.

Update: 2023-11-08 10:00 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు జాన్వీ కపూర్ చాలానే ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్‌ లో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమాతో కూడా కమర్షియల్‌ గా హిట్ ను సొంతం చేసుకోలేదు. వెబ్‌ సిరీస్ లతో కూడా ఈమె మెప్పించలేక పోయింది.


అక్కడ ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా జాన్వీ కపూర్ కి ఇక్కడ శ్రీదేవి కూతురు అవ్వడం వల్ల మంచి క్రేజ్ ఉంది. అందుకే ఏకంగా ఎన్టీఆర్ తో కొరటాల శివ దర్శకత్వంలో క్రేజీ మూవీ 'దేవర' లో నటించే అవకాశం దక్కించుకుంది. జాన్వీ కపూర్ కి దేవర తో మొదటి కమర్షియల్ బ్రేక్ దక్కబోతుంది అంటూ శ్రీదేవి అభిమానులతో పాటు అంతా కూడా బలంగా నమ్ముతున్నారు.


సినిమాల విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అనడంలో సందేహం లేదు. ఆమె సినిమాల్లో హిట్ లేకున్నా కూడా కేవలం సోషల్‌ మీడియా హాట్‌ ఫోటోల కారణంగానే ఈ రేంజ్‌ లో గుర్తింపు, క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా మరోసారి ఈఅమ్మడు సోషల్‌ మీడియాలో హాట్‌ అందాల షో తో వైరల్‌ అయ్యింది.


ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ అయిన మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీ లో ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో పాటు పాన్ ఇండియా సెలబ్రిటీ లు పాల్గొన్నారు. ఆ దీపావళి పార్టీ లో ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ కూడా పాల్గొంది. ఈ ఔట్ ఫిట్‌ లో అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.


ఇలాంటి పార్టీలకు సాధారణంగానే హాట్ బ్యూటీ లు హాట్ షో లు చేస్తూ ఔట్ ఫిట్ లో సందడి చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే దీపావళి చిచ్చుబుడ్డి మాదిరిగా జాన్వీ కపూర్‌ హాట్‌ హాట్ లుక్ లో కనిపించి సందడి చేసింది. జాన్వీ కపూర్‌ ఈ హాట్ ఫోటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News