ఆత్మ ఆవహించిన ఇంటిని కొనుక్కున్న నటి
అది ప్రశాంతమైన సిటీ ఔటర్.. అక్కడ ఒక అందమైన ఉద్యానవనంలో అతి భారీ బంగ్లా. అక్కడ ఏవేవో సంఘటనలు జరుగుతుంటాయి.
అది ప్రశాంతమైన సిటీ ఔటర్.. అక్కడ ఒక అందమైన ఉద్యానవనంలో అతి భారీ బంగ్లా. అక్కడ ఏవేవో సంఘటనలు జరుగుతుంటాయి. ఆ బంగ్లాలో మరణాలు ఊహకు అందనివి. కొందరు ఆత్మలు ఉన్నాయంటారు. మరికొందరు దుర్మార్గులే చంపేసారని అంటారు. కానీ దాని రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి హీరో లేదా పరిశోధకుడు అక్కడ దిగితే కానీ అసలు సంగతి తేలదు. ఇలాంటి ఇతివృత్తంతో ఇప్పటికే ఎన్నో హారర్ సినిమాలొచ్చాయి. హిలేరియస్ కామెడీ ఫన్, దడ పుట్టించే సీన్స్ తో రక్తి కట్టించడంతో ఇవన్నీ ఘనవిజయాలు సాధించాయి.
కానీ ఇక్కడ స్టోరి అదికాదు.. ఆ భవంతిలోని అపార్ట్ మెంట్ లో ప్రముఖ యువహీరో చనిపోయాడు. అది ఆత్మహత్యా? హత్యా? అన్నది ఇంకా తేలనేలేదు. ఏళ్లు గడుస్తున్నా విచారణ ఫర్వం కొనసాగుతోందే కానీ కోర్టు కూడా ఏదీ తేల్చడం లేదు. సీబీఐ- ఎన్సీబీ సహా ప్రఖ్యాత దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసు ఇది. అయితే ఆ హీరో ఆ బంగ్లాలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వల్ల ఆ తర్వాత దానిని కొనుగోలు చేసేందుకు కానీ అద్దెకు దిగేందుకు కానీ ఎవరూ రాలేదు. దీంతో యజమాని దానిని అలానే ఖాళీగా వదిలేయాల్సి వచ్చింది.
2020 జూన్ లో బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు ధృవీకరించారు. ఇలాంటి ఒక భయానక సంబంధం కారణంగా ఆ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే అపార్ట్ మెంట్ కి సమీపంలోని మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్స్లో అదా శర్మ నివశించేది. దీంతో ఇటీవల సుశాంత్ సింగ్ చనిపోయిన ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని కూడా ప్రచారం అవుతోంది. అయితే ఈ అపార్ట్ మెంట్ కి కొన్ని చిక్కులున్నాయి. దీనిని యజమాని చాలా కాలంగా అమ్మకానికి పెట్టారు. కనీసం అద్దెకు ఎవరైనా వస్తారని కూడా ఎదురు చూశాడు. కానీ అవి రెండూ జరగలేదు. ఫ్లాట్ కు అద్దెదారులు ఎవరూ దొరకలేదు. ముంబై బాంద్రాలో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుందరమైన సీవ్యూతో ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కానీ అపార్ట్ మెంట్ లో మిస్టీరియస్ డెత్ వల్ల ఎవరూ అటువైపు చూసేందుకే ఆసక్తిని కనబరచలేదు.